Saaho: ప్రభాస్ ‘సాహో’ ఆ రెండు సూపర్ హిట్ సినిమాలకు కాపీనా.. ?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమాపై తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘సాహో’ సినిమా తెలుగులో వచ్చిన ఈ రెండు సూపర్ హిట్ సినిమాలకు కాపీ అనే విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

news18-telugu
Updated: August 23, 2019, 9:16 PM IST
Saaho: ప్రభాస్ ‘సాహో’ ఆ రెండు సూపర్ హిట్ సినిమాలకు కాపీనా.. ?
‘సాహో’లో ప్రభాస్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 23, 2019, 9:16 PM IST
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమాపై తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు తాజాగా సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది. మొత్తంగా ఈ సినిమా 2 గంటల 54 నిమిషాలు నిడివితో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఓ రేంజ్‌లో జరిగినట్టు సమాచారం. అఫీషియల్‌గా ప్రకటించిక పోయినా.. సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 330 కోట్లకు పైగా జరిగినట్టు సమాచారం. తెలంగాణ, ఏపీలో కలిపి ఈ  సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ. 125కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.సౌత్‌లో మిగిలిన భాషల్లో కలిపి రూ.46 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. హిందీ వెర్షన్ విషయానికొస్తే.. రూ.120 కోట్లకు అమ్ముడుపోయింది. తమిళంలో ఈ సినిమాను దాదాపు 550 స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతుంది. అదే బాహుబలి విషయానికొస్తే..525 స్క్రీన్స్‌లో ప్రదర్శితమైంది. ఈ రకంగా ‘సాహో’ సినిమా కూడా మరో రికార్డు క్రియేట్ చేసింది.

Prabhas another record with Saaho movie and got the Twitter emoji for the first time in Tollywood pk బాహుబలితో ఇప్పటికే ఎన్నో రికార్డులకు తెరతీసాడు ప్రభాస్. సాహో తెలుగు సినిమా స్థాయిని మరింత పైకి తీసుకెళ్తుంది. రాజమౌళి బాహుబలితోనే ఇది చేసి చూపించాడు. ఇప్పుడు ప్రభాస్ మరోసారి ఇదే చేస్తున్నాడు. saaho,saaho movie,saaho movie twitter,saaho movie twitter emoji,saaho prabhas,prabhas saaho movie,saaho movie business,saaho movie pre release business,saaho movie review,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో,సాహో ట్విట్టర్ ఎమోజీ,సాహో తెలుగు సినిమా,ప్రభాస్
ప్రభాస్ సాహో ట్విట్టర్ ఎమోజీ (Source: Twitter)


తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం..దాదాపు రూ.2 వేల కోట్ల రాబరీతో కథతో ఈ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా స్టోరీ పెద్దగా లేకపోయినా.. బ్యాంక్ రాబరీ నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం. గతంలో వచ్చిన శంకర్, అర్జున్‌ల ‘జెంటిల్మెన్’, రవితేజ ‘కిక్’ తరహాలో ‘సాహో’ ఉంటుందని సమాచారం. హీరో దొంగలా ఎందుకు మారాడు. అందుకు దారితీసిన పరిస్థితుల నేపథ్యంలోనే ‘సాహో’ సినిమాను తెరకెక్కించనట్టు సమాచారం.మొత్తానికి భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మన దేశ చిత్ర పరిశ్రమ చూడని యాక్షన్ సన్నివేశాలకు ఈ సినిమాలో కొదవలేదన్నట్టు సమాచారాం. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్,మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...