కళ్లు చెదిరే రేటుకు అమ్ముడుపోయిన ప్రభాస్ మూవీ శాటిలైట్ రైట్స్..

‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయింది.

news18-telugu
Updated: April 10, 2020, 11:36 AM IST
కళ్లు చెదిరే రేటుకు అమ్ముడుపోయిన ప్రభాస్ మూవీ శాటిలైట్ రైట్స్..
ప్రభాస్
  • Share this:
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ప్రపంచ వ్యాప్తంగా హీరోగా ప్రభాస్‌కున్న క్రేజ్‌తో ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క హిందీలోనే ఏకంగా రూ. 200 కోట్ల వరరకు రాబట్టి హీరోగా ప్రభాస్ క్రేజ్ ఏమిటో చెప్పకనే చెప్పింది. ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమాను అమెజాన్ వారు రూ. 100 కోట్లను పెట్టి మరి కొనుక్కున్నారు. మరోవైపు ఈ సినిమా తెలుగు తప్పించి మిగతా భాషలకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడమే కాదు. ఆయా భాషల్లో ఈ సినిమాను ప్రసారం చేసారు. కానీ తెలుగు శాటిలైట్ రైట్స్‌ను మాత్రం హోల్డ్‌లో పెట్టారు. తాజాగా ‘సాహో’ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు చానల్ రూ.20 కోట్లకు కొనుగోలు చేసింది.

Prabhas Saaho movie Satellite Rights sold whopping price,prabhas,prahbas saaho,prabhas saaho satelite rights, saaho satelight rights sold whopping price,saaho,amazon prime,saaho amazon prime,saaho amazon prime streaming,saaho movie,saaho movie twitter,Prabahs saaho,saaho movie closing collections,saaho movie box Office collections,saaho movie collections,saaho collections,saaho 400 crores,saaho 400 crore collections,prabhas saaho,prabhas saaho collections,telugu cinema,సాహో,ప్రభాస్ సాహో,సాహో కలెక్షన్స్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,తెలుగు సినిమా,సామో అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్, భారీ రేటుకు అమ్ముడపోయిన సాహో శాటిలైట్ రైట్స్,సాహో తెలుగు శాటిలైట్ రైట్స్
ప్రభాస్ ‘సాహో’ (Twitter/Photo)


ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలందరు ఇళ్లలోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రసారమైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు 23 పైగా టీఆర్పీ వచ్చింది. ఈ టీర్పీ రావడంలో కరోనా లాక్‌డౌన్ కూడా కీ రోల్ పోషించిందనే చెప్పాలి. దాదాపు ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడం అదే సమయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రసారం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి మరి చూసారు. దీంతో మహేష్ బాబు గత ఏ సినిమాలకు లేనటు వంటి రేటింగ్ ఈ సినిమాకు వచ్చింది. మరోవైపు గత ఐదారాళ్లలో ఏ సినిమాకు ఈ స్థాయి రేటింగ్ రాలేదు. అందుకే సాహో చిత్ర యూనిట్ వెంటనే ‘సాహో’ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను సరైన సమయంలో ఓ తెలుగు ఛానెల్‌కు అమ్ముకున్నారు. దీంతో నెక్ట్స్ వీక్ లోపే ఈ సినిమా సదరు టీవీ ఛానెల్‌లో ప్రసారం అయ్యేలా ఒప్పందం చేసుకున్నారు.  దాదాపు ఎక్కువ మంది ప్రజలకు ఇంకా అమెజాన్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ లేవు. చాలా మంది ప్రజలకు ఇప్పటికే శాటిలైట్ టీవీ ఛానెల్స్‌లో ప్రసారమయితేనే సినిమాలు చూసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సమయంలో శాటిలైట్ ఛానెల్‌లో సినిమాను ప్రసారం చేస్తే ఎక్కువ టీఆర్పీ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే వెంటనే ‘సాహో’ సినిమాకు సంబంధించిన శాటిలైట్ డీల్‌‌ను యూవీ క్రియేషన్స్ వాళ్లు వెంటనే క్లియర్ చేసినట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 10, 2020, 11:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading