ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నది రెండే రెండు వార్తల కోసం. ఒకటి ఆయన పెళ్లి అయితే మరోటి సాహో సినిమా. పెళ్లి ముచ్చట్లు ఇప్పుడు తీరేలా కనిపించడం లేదు కానీ సాహో సినిమా గురించి మాత్రం చెప్తున్నాడు ప్రభాస్. ఈయన నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. హాలీవుడ్ సినిమా స్థాయిలో ‘సాహో’ సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాన్ని బయట పెట్టారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతుంది. అక్కడే భారీ సెట్టింగులు వేసి షూట్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్. దీనికోసం ప్రత్యేకంగా 40 కోట్లతో సెట్ కూడా వేయించాడు ఈ కుర్ర దర్శకుడు. ఆగస్ట్ 15న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ , తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదల కానుంది. ఇప్పటికే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓ మేకింగ్ వీడియో విడుదల చేసాడు సుజీత్.
ఇప్పుడు శ్రద్ధాకపూర్ పుట్టినరోజు కానుకగా మార్చి 3న మేకింగ్ వీడియో 2 విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. దీనిపై త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిను ఆనంద్, మందిరా బేడీ ఈ సినిమాలో నటిస్తున్నారు. వాళ్లు ఉండటంతో హిందీలో కూడా సాహో గురించి బాగానే చర్చ జరుగుతుంది. దానికి తోడు బాహుబలి క్రేజ్ కూడా ఉంది. 200 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సుజీత్. మొత్తానికి సాహో టీజర్ విడుదల కానుండటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకోడానికి సిద్ధమవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Prabhas, Shraddha Kapoor, Telugu Cinema, Tollywood