సాహో ప్రభాస్.. రికార్డ్ టిఆర్పీ తీసుకొచ్చిన హిందీ వర్షన్..

Saaho Hindi TRP: సాహో సినిమాను ఎందుకో తెలియదు కానీ నార్త్ ఆడియన్స్ ఆదరించినట్లు మన వాళ్లు పట్టించుకోలేదు. ఈ చిత్రం తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం పెద్ద విజయం సాధించింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 9, 2020, 4:20 PM IST
సాహో ప్రభాస్.. రికార్డ్ టిఆర్పీ తీసుకొచ్చిన హిందీ వర్షన్..
సాహో పోస్టర్ (Saaho poster)
  • Share this:
సాహో సినిమాను ఎందుకో తెలియదు కానీ నార్త్ ఆడియన్స్ ఆదరించినట్లు మన వాళ్లు పట్టించుకోలేదు. ఈ చిత్రం తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం పెద్ద విజయం సాధించింది. బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా అయితే కావాలనుకున్నాడో.. అలాంటి సినిమానే ఇచ్చాడు సుజీత్. సాహోతో బాలీవుడ్‌లో తన సత్తా చూపించాడు. ఈ చిత్రం అక్కడ 150 కోట్లకు పైగా వసూలు చేసి స్టార్ హీరోల రేంజ్ దాటిపోయింది. ఇక ఇప్పుడు టీవీలో కూడా రచ్చ చేస్తుంది సాహో. ఈ చిత్ర హిందీ వర్షన్ దుమ్ము దులిపేస్తుంది. ఇప్పటికే తొలిసారి టీవీలో వచ్చినపుడు రికార్డ్ టిఆర్పీ తీసుకొచ్చిన ఈ చిత్రం.. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ చేసింది.
సాహో పోస్టర్ (Saaho poster)
సాహో పోస్టర్ (Saaho poster)


బార్క్ రేటింగ్స్ ప్రకారం ఏప్రిల్ 25 నుండి మే 1 వరకు సాహో చిత్రం అన్నింటిని మించి అగ్రస్థానంలో నిలిచింది. పట్టణ ప్రాంతాలలో 5,303,000 ఇంప్రెషన్స్.. గ్రామాలలో 3,300,000 ఇంప్రెషన్స్ లభించాయి. మొత్తంగా 8.33 మిలియన్స్ ఇంప్రెషన్స్ సాధించి తొలిస్థానంలో నిలిచింది సాహో. ఈ చిత్రం తర్వాత రెండో స్థానంలో బాహుబలి ది బిగినింగ్ 7,389,000 ఇంప్రెషన్స్‌తో నిలిచింది. తొలి రెండు స్థానాల్లోనూ ప్రభాస్ ఉండటం ఇక్కడ గమనార్హం.
దర్బార్ పోస్టర్ (darbar movie)
దర్బార్ పోస్టర్ (darbar movie)

మూడో స్థానంలో రజనీకాంత్ దర్భార్ హిందీ వర్షెన్ (7,190,000).. నాలుగో స్థానంలో అక్షయ్ కుమార్ హౌజ్‌ఫుల్‌(6,018,000).. ఐదో స్థానంలో అమితాబ్ బచ్చన్ సూర్యవంశం (4,773,000) ఉన్నాయి. మొత్తానికి సాహోతో ఇప్పటికీ నార్త్‌లో సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు ప్రభాస్. బాహుబలి అంటే రాజమౌళి అనుకున్న వాళ్లకు సాహోతో నిజంగానే సాహో అనిపించాడు యంగ్ రెబల్ స్టార్.
Published by: Praveen Kumar Vadla
First published: May 9, 2020, 4:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading