Saaho: హిందీలో కూడా ఆగని ప్రభాస్ సంచలనాలు..

రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్.. ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. అందరి అంచనాలకు తగ్గట్టే ‘సాహో’ సినిమా  ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది.ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా సంచలనాలకు వేదికగా నిలిచింది.

news18-telugu
Updated: September 18, 2019, 7:39 AM IST
Saaho: హిందీలో కూడా ఆగని ప్రభాస్ సంచలనాలు..
‘సాహో’ మూవీ కలెక్షన్స్
news18-telugu
Updated: September 18, 2019, 7:39 AM IST
రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్.. ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. అందరి అంచనాలకు తగ్గట్టే ‘సాహో’ సినిమా  ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న  ‘సాహో’ పని అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా టాక్‌తో సంబంధం లేకుండా ప్రభాస్ ‘సాహో’తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాడు. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ. 430 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది.

Saaho movie 6 days WW collections and Prabhas movie need to go long way pk సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఇప్పటికే 6 రోజులు పూర్తైపోయాయి కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. saaho,saaho movie collections,saaho movie 6 days collections,saaho movie,saaho movie twitter,prabhas movie saaho,prabhas twitter,prabhas saaho collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,సాహో కలెక్షన్స్,సాహో 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
సాహో చిత్రంలో దృశ్యం (Image:Lisaraniray/Instagram)


ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినా.. వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా మంచి వసూళ్లనే కురిపిస్తోంది. నెగిటివ్ టాక్‌లోను ఈ సినిమా ప్రభంజనం సృష్టించడం చూసి బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఆశ్యర్యపోతున్నారు.ఈ సినిమా హిందీ వెర్షన్ రూ.153 కోట్లు రాబట్టినట్టు సినిమా నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు.

బాలీవుడ్‌లో రూ.153 కోట్లు కొల్లగొట్టిన ‘సాహో’ మూవీ




పాన్ ఇండియా మూవీగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తంగా త్వరలో రూ.500 కోట్ల మార్క్ అందుకునే దిశగా పరుగులు తీస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్‌ కూడా గత కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ‘సాహో’ సినిమా బాలీవుడ్‌లో సంచలనాలు రేపుతోంది.

Loading...
 
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...