‘సాహో’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. సైకో సయాన్ అంటూ శ్రద్ధాతో ప్రభాస్ రచ్చ..

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. దాాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తెరకెక్కిస్తున్నారు.తాజాగా  ఈ చిత్రంలోని ‘సైకో సయాన్’ అనే పాటను రిలీజ్ చేసారు. 

news18-telugu
Updated: July 5, 2019, 10:55 AM IST
‘సాహో’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. సైకో సయాన్ అంటూ శ్రద్ధాతో ప్రభాస్ రచ్చ..
సాహో ఫస్ట్ సింగిల్ రిలీజ్
  • Share this:
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. దాాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ సన్నిహితులకు చెందిన యూవీ  క్రియేషన్స్ నిర్మాణంలో సుజీత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మ‌ధ్యే ఆస్ట్రియాలోని ఇన్స్‌బర్క్, టిరోల్‌లో ఓ పాట చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తాజాగా  ఈ చిత్రంలోని ‘సైకో సయాన్’ అనే పాటను రిలీజ్ చేసారు.


ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా సాహో సినిమా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్.. మేకింగ్ వీడియోల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న మేకింగ్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. కేవ‌లం ఒకే ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడు ఈ స్థాయి ఔట్ పుట్ ఇవ్వ‌డంతో అంతా షాక్‌లోనే ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను  బ‌డ్జెట్ వ‌ర్క‌వుట్ చేయ‌డానికి తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ ‘సాహో’  సినిమాను విడుద‌ల చేస్తున్నారు.

saaho teaser,saaho teaser talk,prabhas saaho teaser talk,saaho movie,saaho movie twitter,saaho movie teaser,saaho movie new teaser,saaho movie teaser june 13,prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie new poster,prabhas saaho movie poster,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో టీజర్,సాహో టీజర్ టాక్,అదరగొట్టిన సాహో టీజర్,సాహో టీజర్‌తో అదరగొట్టిన ప్రభాస్,సాహో న్యూ టీజర్,జూన్ 13న సాహో టీజర్,సాహో సర్‌ప్రైజ్,సాహో న్యూ పోస్టర్,సాహో పోస్టర్,సాహో ఆగస్ట్ 15న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
హాలీవుడ్ తరహాలో తెరకెక్కిన ‘సాహో’ మూవీ


నీల్‌ నితిన్‌ ముఖేశ్‌,ఎవ్లిన్‌ శర్మ,మురళీ శర్మ,జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే బాలీవుడ్లో కూడా ‘సాహో’పై భారీ అంచ‌నాలు  ఉన్నాయి. ఇక ఇప్పుడు పాట విడుద‌లైన త‌ర్వాత అవి మ‌రింత పెరుగ‌తాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. మ‌రి ఈ సినిమాతో బాహుబలితో వచ్చిన ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 5, 2019, 10:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading