PRABHAS SAAHO MOVIE CREATES BOX OFFICE RECORDS HERE ARE THE DETAILS TA
‘సాహో’తో ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డు.. ఇప్పటి వరకు ఏ హీరోలకు సాధ్యం కాలేదు..
‘సాహో’ కలెక్షన్స్
‘బాహుబలి’ తర్వాత హీరోగా ప్రభాస్ క్రేజ్ పీక్స్‌కు వెళ్లింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు.ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది.
‘బాహుబలి’ తర్వాత హీరోగా ప్రభాస్ క్రేజ్ పీక్స్‌కు వెళ్లింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు.ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాకు చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చినా.. వసూళ్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే హిందీ వెర్షన్ ‘సాహో’ సినిమా రూ.100 కోట్లను కొల్లగొట్టింది. ముఖ్యంగా బీటౌన్ ఆడియన్స్ సౌత్ సినిమాలకు, మనవాళ్ల కంటెంట్‌కు మాస్ జనాలను అట్రాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ అగ్ర హీరోలు ఖాన్స్ సైతం హిట్స్ కోసం ముఖం వాచిపోతుంటే.. ప్రభాస్ మాత్రం ‘సాహో’ చిత్రంతో ఇప్పటికే రూ.350 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌గా రన్ అవుతూనే ఉంది.
సాహో కలెక్షన్స్ (Source: Twitter)
ఈ రకంగా వీకెండ్ మూడు నాలుగు రోజుల్లోనే రూ.350 కోట్ల వసూళ్లను సాధించిడం ఇప్పటి వరకు ఏ హీరోకు సాధ్యం కాలేదు. వరల్డ్ వైడ్‌గా వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా ‘సాహో’ నిలిచింది. ఈ లిస్టులో హాలీవుడ్ చిత్రం ‘హాబ్స్ అండ్ షా’ ఉంది. తర్వాతి స్థానాల్లో ‘ది లయన్ కింగ్’‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’, ‘ఏంజల్ హ్యాస్ ఫాలెన్’ ఉన్నాయి. ముందు ముందు ‘సాహో’ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.