Saaho: ప్రభాస్ ‘సాహో’ సెన్సార్ పూర్తి.. ఇంతకీ రన్ టైమ్ ఎంతంటే.. ?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

news18-telugu
Updated: August 22, 2019, 10:25 AM IST
Saaho: ప్రభాస్ ‘సాహో’ సెన్సార్ పూర్తి.. ఇంతకీ రన్ టైమ్ ఎంతంటే.. ?
ప్రభాస్ ‘సాహో’ (Youtube/Photo)
  • Share this:
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో  ఇంటర్నేషనల్ లెవల్‌లో ఉన్నయాక్షన్ సీన్స్ సినీ ప్రముఖులను సైతం ఆశ్యర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం రన్ టైమ్ 2 గంటల 54 నిమిషాలు ఉన్నట్టు సమాచారం. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్,మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 22, 2019, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading