హోమ్ /వార్తలు /సినిమా /

బాలీవుడ్‌లో ప్రభాస్ ‘సాహో’ సరికొత్త రికార్డు.. టీఆర్పీ రేటింగ్స్‌ చించేసాడుగా..

బాలీవుడ్‌లో ప్రభాస్ ‘సాహో’ సరికొత్త రికార్డు.. టీఆర్పీ రేటింగ్స్‌ చించేసాడుగా..

సాహో పోస్టర్ Instagram.com/officialsaahomovie

సాహో పోస్టర్ Instagram.com/officialsaahomovie

Prabhas Saaho | ‘సాహో’తో ప్రభాస్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అవును ఏ భారతీయ హీరో సాధించలేని రికార్డు ‘సాహో’తో ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. తాజాగా హిందీలో సాహో రికార్డు..

‘సాహో’తో ప్రభాస్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అవును ఏ భారతీయ హీరో సాధించలేని రికార్డు ‘సాహో’తో ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తాజాగా ప్రభాస్ బాలీవుడ్ బడా హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్‌లు సాధించలేనిది ఇపుడు ప్రభాస్ సాధించి చూపెట్టాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ హిట్టు కోసం మొఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్నాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ తర్వాత ఆ స్థాయి హిట్ అన్నదే లేదు. మరోవైపు ఆమీర్ ఖాన్..‘దంగల్’ వంటి సినిమాలతో సంచలనాలు సృష్టిస్తున్నా ఆ తర్వాత అదే ఊపును కంటిన్యూ చేయడం లేదు. ఇంకోవైపు సల్మాన్ ఖాన్.. చెత్త రివ్యూలతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొడుతున్న సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోతున్నాడు. కానీ తెలుగు హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం.. వరుసగా ‘బాహుబలి 1’, బాహుబలి 2’ తో పాటు తాజాగా ‘సాహో’తో వరుసగా రూ.400 కోట్లను అందుకున్న తొలి భారతీయ హీరోగా రికార్డులకు ఎక్కిన సంగతి తెలిసిందే కదా.

Jacqueline Fernandez is top indian celebrity of tik tok,Jacqueline Fernandez,prabhas,prabhas saaho,prabhas saaho Jaqueline Fernandez,Jacqueline Fernandez tik tok queen,tik tok queen Jacqueline Fernandez,Riteish Deshmukh,kapil sharma,madhuri dixit,bollywood,tik tok,tick talk,జాక్వెలిన్ ఫెర్నాండేజ్,జాక్వెలిన్ టిక్ టాక్,జాక్వెలిన్ ఫెర్నాండేజ్ టిక్ టాక్ స్టార్,ప్రభాస్ సాహో,ప్రభాస్ సాహో,రితేష్ దేశ్‌ముఖ్,మాధురి దీక్షిత్,కపిల్ శర్మ,ప్రభాస్
ప్రభాస్,జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Youtube/Credit)

ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోలకు మాత్రమే పరిమితమైన వందల కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా రాబట్టేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రూ.400 కోట్లను రాబట్టి.. బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్టడీగా రన్ అవుతూనే ఉంది. కేవలం బాలీవుడ్‌లోనే రూ. 200 కోట్లను రాబట్టింది.  ఏమైనా ఒక తెలుగు హీరో అయివుండి.. జాతీయ స్థాయిలో ఈ రకమైన వసూళ్లతో బీటౌన్ హీరోలకు ప్రకంపనలు పుట్టిస్తున్నాడు ప్రభాస్. తాజాగా ఈయన యాక్ట్  చేసిన ‘సాహో’ హిందీ వెర్షన్ డిజిటల్ వేదికగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక టీఆర్పీ సాధించిన టెలివిజన్ ప్రీమియర్‌గా ‘సాహో’ రికార్డులు బద్దలు కొట్టింది.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood, Hindi Cinema, Prabhas, Prabhas saaho, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు