పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాణంలో శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘లాయర్ సాబ్’, లేదా ‘వకీల్ సాబ్’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. చిత్ర యూనిట్ ‘వకీల్ సాబ్’ పేరునే దాదాపు ఖరారు చేసేలా ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన పార్ట్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఏ.ఎం.రత్నం డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని పండగ సాయన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉంది. ముందుగా ఈ చిత్రంలో పూజా హెగ్డే, కియారా అద్వానీ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత వాణీ కపూర్ పేరు కూడా వినబడింది. తాజాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించబోతున్నట్టు సమాచారం.
ఈమె హిందీలో సల్మాన్ సరసన రేస్ 3 తో పాటు కిక్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తెలుగులో ప్రభాస్ హీరోగా నటించిన సాహోలో ఒక పాటలో మెరిసింది. ఇపుడు పవన్ కళ్యాణ్ సినిమాలో పూర్తిస్థాయిలో హీరోయిన్గా నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ‘లోఫర్’ భామ దిశా పటానీ కూడా యాక్ట్ చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి వీళ్లైన ఈసినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తారా లేకపోతే వేరే ఎవరైనా తీసుకొస్తారా అనేది చూడాలి. పాలమూరు పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ దీనికి వీరూపాక్షి అనే డిఫెరెంట్ టైటిల్ వినిపిస్తుంది.
ఇందులో పవన్ పాత్ర పేరు వీర. అందుకే ఈ సినిమాకు ఇలాంటి టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం పవన్ చాలా కష్టపడుతున్నాడు. విజువల్‌గా కూడా చాలా రిచ్‌గా ఉండబోతుంది ఈ చిత్రం. దాదాపు 100 కోట్లతో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాలో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా చార్మినార్, తాజ్ మహల్ సెట్స్ కూడా నిర్మించారు. 2021లో సినిమా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha Patani, Jacqueline Fernandez, Krish, Pawan kalyan, Pooja Hegde, Telugu Cinema, Tollywood