Saaho: బాలీవుడ్‌లో కూడా ప్రభాస్ ‘సాహో’ సంచలనాలు..

రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్.. ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. అందరి అంచనాలకు తగ్గట్టే ‘సాహో’ సినిమా  ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది.ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా సంచలనాలకు వేదికగా నిలిచింది.

news18-telugu
Updated: September 8, 2019, 7:35 AM IST
Saaho: బాలీవుడ్‌లో కూడా ప్రభాస్ ‘సాహో’ సంచలనాలు..
ప్రభాస్ ‘సాహో’
  • Share this:
రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్.. ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేసాడు. అందరి అంచనాలకు తగ్గట్టే ‘సాహో’ సినిమా  ఫస్ట్ డే అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. మొదటి రోజే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.138 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తంగా ఏడు రోజులకు అన్ని భాషల్లో కలిపి రూ.370 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తొలిరోజు, తొలి ఆట నుంచే డివైడ్ టాక్. ఇక ఈ ‘సాహో’ పని అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా టాక్‌తో సంబంధం లేకుండా ప్రభాస్ ‘సాహో’తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాడు. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది.

young rebel star prabhas saaho first week colletions,prabhas,prabhas saaho movie collections,saaho 7days collections,saaho first week collections,saaho,saaho movie collections,saaho movie 6 days collections,saaho movie,saaho movie twitter,prabhas movie saaho,prabhas twitter,prabhas saaho collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,సాహో కలెక్షన్స్,సాహో 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా,సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్,సాహో 7 రోజుల కలెక్షన్స్,
‘సాహో’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (Twitter/Photo)


ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినా.. వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా మంచి వసూళ్లనే కురిపిస్తోంది. నెగిటివ్ టాక్‌లోను ఈ సినిమా ప్రభంజనం సృష్టించడం చూసి బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఆశ్యర్యపోతున్నారు. 2019లో బాలీవుడ్‌లో విడుదలైన సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయంలో ‘సాహో’ 5వ స్థానంలో ఉన్నట్టు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. 8 రోజుల్లో బాలీవుడ్‌లో ‘సాహో’ మొత్తంగా రూ.120.28 కోట్లను కొల్లగొట్టింది. మొదటి రోజు రూ.24.40 కోట్లను వసూలు చేసిన ‘సాహో’ రెండో రోజు రూ.25.20 కోట్లు.. మూడు రోజు రూ.29.48 కోట్లు, నాల్గో రోజు రూ.14.20 కోట్లు ఐదో రోజు రూ.9.10 కోట్లు, ఆరో రోజు 6.90 కోట్లు, ఏడో రోజు రూ.6.75 కోట్లు, ఎనిమిదో రోజు రూ.4.25 కోట్లు వసూళు చేసినట్టు ప్రకటించారు. ఓవర్సీస్ కలుపుకుంటే హిందీ వెర్షన్ మరో రూ.30 కోట్లు అదనం. ఈ రకంగా బాలీవుడ్‌లో దాదాపు రూ.150 కోట్లను కొల్లగొట్టి ప్రభాస్..నిజంగానే ‘సాహో’ అనిపిస్తున్నాడు.





 
First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...