హోమ్ /వార్తలు /సినిమా /

పవన్, మహేష్ రికార్డ్‌లను బ్రేక్ చేసిన ప్రభాస్ సాహో...

పవన్, మహేష్ రికార్డ్‌లను బ్రేక్ చేసిన ప్రభాస్ సాహో...

‘సాహో’ కలెక్షన్స్

‘సాహో’ కలెక్షన్స్

Saaho : ప్రభాస్ సాహో.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది.

  ప్రభాస్ సాహో.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చిన కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా 'సాహో' కలెక్షన్స్‌ను భాగానే రాబట్టింది. హిందీ రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటి రోజున రూ.25 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే నాన్ హాలీడే రోజున సాహో చిత్రం ఇంతగా రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అది అలా ఉంటే.. ఇక ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్‌లో 'సాహో' చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టింది.


  టాప్ 10 ఓవర్సీస్ తెలుగు సినిమాల ప్రీమియర్స్ కలెక్షన్స్ చూస్తే... ‘బాహుబలి 2’ 2.4 మిలియన్‌ డాలర్ల్స్  వసూలు చేయగా.. ‘అజ్ఞాతవాసి’ 1.52 మిలియన్‌ డాలర్ల్స్ , ‘బాహుబలి 1 '  1.39 మిలియన్‌ డాలర్ల్స్ వసూలు చేసింది. ఇక చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ 1.29 మిలియన్‌ డాలర్ల్స్  వసూలు చేయగా.. మహేష్ ‘స్పైడర్‌’ 1.00 మిలియన్‌ డాలర్ల్స్ రాబట్టింది. కాగా నిన్న విడుదలైన ప్రభాస్ ‘సాహో’ 915 వేల డాలర్ల్స్ తో ఆరో స్థానంలో నిలిచింది. దీని తర్వాత మహేష్ ‘భరత్‌ అనే నేను’ 850 వేల డాలర్ల్స్ వసూలు చేయగా.. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ 789 వేల డాలర్ల్స్ , ‘రంగస్థలం’ 725 వేల డాలర్ల్స్ , పవన్ కళ్యాన్ ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ 616 వేల డాలర్ల్స్  రాబట్టి తర్వాతి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఆగస్టు 30న విడుదలైన సాహోను సుజీత్‌ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించింది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Prabhas saaho, Telugu Cinema News

  ఉత్తమ కథలు