బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్.. కొత్త అవతారం ఎత్తింది. ఫిట్నెస్ ఫ్రీక్‌గా మారింది. సాధారణంగా కూల్ అండ్ క్యూట్ ఫొటోలను షేర్ చేసే దిశా పటాని లేటెస్ట్ ఫొటోలో తన ట్రెండ్ మార్చింది. తను చేస్తున్న ఫిట్నెస్ ఎక్సర్సైజులకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేయడం విశేషం. దీని గురించి ఇన్‌స్టా ద్వారా తెలియజేసిన శ్రద్ధాకపూర్.. నేను నా శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేకమైన శద్ధ తీసుకుంటున్నాను. దీని వల్ల నా మనసు, బుద్ధిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకున్నాను. ఇదొక ఆధ్యాత్మిక సాధనగా నేను భావిస్తున్నాను అంటూ ఫిట్నెస్ పరంగా తానెలా కష్టపడుతున్నాననే విషయాన్ని శ్రద్ధాకపూర్ తెలియజేసింది. అయితే శ్రద్ధాకపూర్ పోస్ట్ చేసిన యోగా పొజిషన్ చూసిన వారు
శ్రద్ధాకపూర్ చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. గత ఏడాది స్ట్రీట్ డాన్సర్, భాఘి 3 చిత్రాల్లో నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన సాహోతో దక్షిణాది ప్రేక్షకులను కూడా పలకరించింది. కోవిడ్ సమయంలో శ్రద్ధాకపూర్ ఏ సినిమాను అంగీకరించలేదా? అని అందరూ అనుకుంటున్నారు.
శ్రద్ధాకపూర్ లేటెస్ట్ ఫోటోస్ (Shraddha Kapoor/Instagram video)
View this post on Instagram
శ్రద్ధాకపూర్ లేటెస్ట్ ఫోటోస్ (Shraddha Kapoor/Instagram Photo)
View this post on Instagram
శ్రద్ధాకపూర్ లేటెస్ట్ ఫోటోస్ (Shraddha Kapoor/Instagram Photo)
View this post on Instagram
శ్రద్ధాకపూర్ తోటి నాయికలు వరుస సినిమాలను ఒప్పుకుంటూ స్పీడు చూపిస్తుంటే, ఈమె మాత్రం పరిమితంగానే పరిమితంగా సినిమాలు చేస్తూ వస్తుంది. అసలు ఈ ఏడాది హీరోయిన్స్ అందరూ డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటూ ఉంటే, శ్రద్ధాకపూర్ మాత్రం ఖాళీగా ఉండటం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Shradda kapoor