Saaho: ‘సాహో’ సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ భారీ స్కెచ్..

సాహో న్యూ పోస్టర్ (Source: Twitter)

ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు.

  • Share this:
    ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదైలన ఈ సినిమా పోస్టర్స్‌తో పాటు టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకను దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహించనున్నట్టు సమాచారం. తాజాగా ఈ చిత్ర ఆడియోను ఆగష్టు 17న హైదరాబాద్‌లో, 21న కొచ్చిన్‌లో , 25న బెంగళూరులో , 27న ముంబైలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
    ఈ సినిమాను ఆగష్టు 30న విడుదల చేయనున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇతర ముఖ్యపాత్రల్లో నీల్ నితిన్ ముఖేష్,ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర నిజంగానే ‘సాహో’  అనిపిస్తాడా లేదా అనేది చూడాలి.
    First published: