news18-telugu
Updated: November 30, 2020, 9:45 AM IST
సమంత, ప్రభాస్ Photo : Twitter
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తూనే.. మరోవైపు తన ఇతర సినిమాలకు సంబందించిన కథా చర్చల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఎప్పుడో విడుదలకావాల్సిన రాధేశ్యామ్ సినిమా కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవ్వడంతో ప్రస్తుతం ఆ సినిమా పై ఫోకస్ చేశాడు ప్రభాస్. వీటితో పాటు ఆయన మెయిన్ లీడ్ రోల్లో ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు బాటీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. అది అలా ఉంటే అక్కినేని కోడలు సమంత తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో శామ్-జామ్ అనే ఓ టాక్ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలు ఏవి చేయని సమంత ఈ కార్యక్రమం కోసం ఏకంగా కోటి 80లక్షల రూపాయల పారితోషికం అందుకుందని టాక్. అయితే ఇక్కడ ఈ షోలో ఆమె కేవలం హోస్ట్ చేయడమే కాదు, సమంతకు తెరవెనక కూడా ఓ పని ఉంది. అదేంటంటే.. హీరోల్ని ఈ షోకు రప్పించే బాధ్యత కూడా ఆమెదేనట. అందుకే అంత మొత్తం ఇవ్వడానికి రెడీ అయ్యారట ఈ షో నిర్వహకులు. ఇక ఈ షో భాగంగా ఇప్పటికే.. సమంత తన పరిచయంతో విజయ్ దేవరకొండ, రానా, నాగ్ అశ్విన్ ను శామ్-జామ్ కార్యక్రమానికి రప్పించుకుని వారిని ఇంటర్వూ చేసింది. సమంత షోకు చిరంజీవి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మాత్రం అల్లు అరవింద్ రిఫరెన్స్ తో వచ్చారు. ఇక అది అలా ఉంటే ఈ షోలో భాగంగా ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను తన షోకు రావాలని పిలిచింది. కానీ ఆమెకు చుక్కెదురైందని సమాచారం.

ప్రభాస్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ Photo : Twitter
సమంత తన టాక్ షో శామ్-జామ్ కార్యక్రమానికి ప్రభాస్ ను తీసుకురావాలనుకుందట. ఈ మేరకు సంప్రదింపులు కూడా ప్రారంభించింది. అయితే ప్రభాస్ మాత్రం మరో ఆలోచన లేకుండా ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమాచారం. దీనికి కారణం లేకపోలేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడట. దీంతో ఇలాంటి టైమ్ లో సమంత ఇంటర్వ్యూకు రావడం తనకు కుదరదని తెగేసి చెప్పేశాడట ప్రభాస్. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ప్రభాస్ మామూలుగానే ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవ్వడం చాలా అరుదు. దీనికి తోడు ప్రభాస్ షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో సింపుల్ గా నో చెప్పేశాడట. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ఆదిపురుష్ చిత్రాన్ని భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా.. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ తన శరీరాన్ని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడని చిత్ర దర్శకుడు ఓమ్ రౌత్ వెల్లడించారు. అంతేకాక ఆయన విలువిద్య నేర్చుకుంటున్నాడన్నారు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు.
Published by:
Suresh Rachamalla
First published:
November 30, 2020, 9:45 AM IST