యంగ్ రెబల్ ప్రభాస్‌ను మెప్పించని మెగా దర్శకుడు..

అవును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను మెగా దర్శకుడు తన స్టోరతో మెప్పించలేకపోయాడు. వివరాల్లోకి వెళితే.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 1, 2020, 7:36 AM IST
యంగ్ రెబల్ ప్రభాస్‌ను మెప్పించని మెగా దర్శకుడు..
ప్రభాస్
  • Share this:
అవును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను మెగా దర్శకుడు తన స్టోరితో మెప్పించలేకపోయాడు. వివరాల్లోకి వెళితే. బాహుబలి తర్వాత గతేడాది ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఆ చిత్రంతో ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం మంచి వసూళ్లనే దక్కించుకుని హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఈయేడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది. ఈ సినిమా చేస్తూనే వేరే దర్శకులు చెబుతున్న కథలు వింటున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ప్రభాస్‌కు ఒక స్టోరీ వినిపించాడట.

prabhas rejects director surender reddy movie these are the reasons,prabhas,surender reddy,prabhas surender reddy,sye raa narasimha reddy,prabhas instagram,prabhas twitter,prabhas facebook,surender reddy,sye raa narasimha reddy,prabhas,surender reddy interview,sye raa narasimha reddy teaser,director surender reddy,prabhas new movie,prabhas saaho,prabhas movies,surendar reddy,prabhas jaan,sye raa narasimha reddy trailer,director surender reddy interview,prabhas about surender reddy,surender reddy about chiranjeevi,prabhas to work with surender reddy,surender reddy interview about sye raa,tollywood,telugu cinema,ప్రభాస్,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,సురేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి ప్రభాస్,సురేందర్ రెడ్డికి నో చెప్పిన ప్రభాస్
ప్రభాస్,సురేందర్ రెడ్డి (Twitter/Photo)


ఈ కథ విని ప్రభాస్..సురేందర్ రెడ్డి నో చెప్పినట్టు సమాచారం. ఇక సురేందర్ రెడ్డి చెప్పిన కథ ప్యాన్ ఇండియా లెవల్‌కి తక్కువగా ఉండటంతో ప్రభాస్ ఈ స్టోరీని రిజెక్ట్ చేసినట్టు సమాచారం.దీంతో సురేందర్ రెడ్డి.. ప్రభాస్‌ను మెప్పించేలా మరో కథను రెడీ చేసేపనిలో ఉన్నాడు. ఇంకోవైపు హిందీ దర్శక, నిర్మాతలు కూడా ప్రభాస్ తో ప్యాన్ ఇండియా లెవల్ సినిమాలు తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు. మొత్తానికి దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రభాస్ నో చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 1, 2020, 7:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading