డై హార్ట్ ఫ్యాన్స్‌ నిరాశ పరిచే పనిచేసిన ప్రభాస్..

అవును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డై హార్ట్ ఫ్యాన్స్ నిరాశ పరిచే పనిచేసాడు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది.

news18-telugu
Updated: February 5, 2020, 7:11 AM IST
డై హార్ట్ ఫ్యాన్స్‌ నిరాశ పరిచే పనిచేసిన ప్రభాస్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Twitter/Photo)
  • Share this:
అవును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డై హార్ట్ ఫ్యాన్స్ నిరాశ పరిచే పనిచేసాడు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. దీంతో అతను చేయబోయే సినిమాలపై అన్ని ఇండస్ట్రీస్‌కీ సంబంధించిన వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. తెలుగుతో పాటు మిగతా భాషల్లో నిరాశ పరిచిన ఈ చిత్రం బాలీవుడ్‌లో మాత్రం రూ.200 కోట్లను కొల్లగొట్టి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్‌కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ రాజ్ ఫిల్మ్స్‌ నుంచి ఒక ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్షన్ ఫ్రాంచైజీగా ‘ధూమ్’ సిరీస్‌కు మంచి క్రేజ్ వుంది. ఈ సిరీస్‌లో తెరకెక్కబోయే నాల్గో సినిమాలో ప్రభాస్‌ను లీడ్ రోల్లో యాక్ట్ చేయమని ఆఫర్ చేసారట. అంతేకాదు ఈ సినిమాలో నటించేందకు దాదాపు రూ. 50 కోట్ల వరకు ఆఫర్ చేసినట్టు సమాచారం.

Saaho Effect on Bahubali star Prabhas and he is in debts because of huge budget movie pk ప్రభాస్‌కు అప్పులేంటి.. ఆయన ఎంత ఆస్తిపరుడు అనేది ప్రత్యేకంగా చెప్పాలా..? ఒక్క సినిమా తేడా కొడితే అప్పుల్లో పడిపోవడం ఏంటి మరీ పిచ్చి కాకపోతేనూ అనుకుంటున్నారా..? నిజమే అయ్యుండొచ్చు.. saaho,saaho movie,saaho movie collections,prabhas saaho,saaho fake collections,saaho movie prabhas,prabhas debts saaho,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో,సాహో ఫైనల్ కలెక్షన్స్,తెలుగు సినిమా,అప్పుల్లో ప్రభాస్
సాహో దర్శకుడు సుజీత్ (Source: Twitter)


అయితే.. ప్రభాస్.. తన కున్న కమిట్‌మెంట్స్ కారణంగా ధూమ్ సిరీస్‌లో యాక్ట్ చేయనని సున్నితంగా తిరస్కరించాడట. దీంతో ధూమ్ 4లో అక్షయ్ కుమార్‌ను లీడ్ రోల్లో తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ ప్లేస్‌‌ను రణ్‌వీర్ సింగ్‌తో రీప్లేస్ చేయాలనుకున్నట్టు సమాచారం. మొత్తానికి ధూమ్ 4లో అంతా కొత్త నటీనటులతో సరికొత్తగా తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు మూవీ మేకర్స్. మొత్తనాకి దేశ వ్యాప్తంగా యాక్షన్ ప్రేమికులు ఎంతో ఇష్టపడే ధూమ్ సిరీస్‌లో యాక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ప్రభాస్ ఎందుకు మిస్ చేసుకున్నాడా అని ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు.

First published: February 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు