Prabhas Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ కొత్త రికార్డు.. అత్యంత వేగంగా ఆ మైల్‌స్టోన్..

ప్రభాస్ (Prabhas)

Prabhas Instagram: యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్​కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ఈయనకు ఏ స్థాయిలో క్రేజ్ పెరిగిపోయిందో చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా..

  • Share this:
యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్​కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత ఈయనకు ఏ స్థాయిలో క్రేజ్ పెరిగిపోయిందో చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఇప్పుడు ప్రభాస్ సూపర్ స్టార్. అందుకే ఈయన సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అలాగే ఉంది. ముఖ్యంగా చాలా ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వచ్చిన ప్రభాస్.. అందరికంటే ముందు రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా ఈయన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వచ్చిన రికార్డులు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. ఇదిరా మా హీరో అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఇంతకీ ప్రభాస్ అంతగా ఏం చేసాడో తెలుసా..? ప్రభాస్​కు సోషల్ ​మీడియాలో ఓ ఫాస్టెస్ట్​ రికార్డు వచ్చింది. ఇన్​స్టాగ్రామ్​లో అడుగుపెట్టిన తర్వాత ప్రభాస్‌లో చాలా మార్పులే వచ్చాయి. అప్పటి వరకు అఫీషియల్‌గా ఏది ప్రకటించని ప్రభాస్.. ఇప్పుడు మాత్రం తన పేజీలోనే అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. మిగిలిన హీరోలతో పోలిస్తే ఇన్‌స్టాలో ఈయన ఉండేది కూడా తక్కువే. కానీ ఫాలోయర్స్ మాత్రం భారీగానే ఉన్నారు. చాలా తక్కువ సమయంలోనే 6 మిలియన్ల ఫాలోయర్స్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. సోషల్ ​మీడియాలో ఇదో వేగవంతమైన ఘనతగా ప్రభాస్​ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ మధ్యే ఫేస్​బుక్​ ఖాతాలో 20 మిలియన్ల ఫాలోవర్స్​ను సాధించాడు. అంతలోనే ఇప్పుడు ఇన్‌స్టాలో కూడా 60 లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నాడు. మరోవైపు కెరీర్ పరంగానూ చాలా బిజీగా ఉన్నాడు డార్లింగ్​ ప్రభాస్​.
prabhas,prabhas twitter,prabhas instagram,prabhas instagram 6 millon followers,prabhas movies,prabhas prashanth neel salaar movie,prabhas radhe shyam,prabhas followers,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ 6 మిలియన్ ఫాలోయర్స్,ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ 6 మిలియన్ ఫాలోయర్స్
ప్రభాస్ ఇన్‌స్టా ఫాలోయర్స్ (Prabhas)

ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇందులో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న 'రాధేశ్యామ్​' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు 'ఆదిపురుష్​' త్వరలోనే మొదలు కానుంది. ఇక ప్రశాంత్ నీల్ సలార్ కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. నాగ్ అశ్విన్​ సినిమా సైతం వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. 2023లోపు ఈ మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా తరుచూ సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తున్నాడు ప్రభాస్. ఏదేమైనా కూడా ప్రభాస్ 6 మిలియన్ ఫాలోయర్స్ మాత్రం చాలా త్వరగానే రీచ్ అయ్యాడు.
Published by:Praveen Kumar Vadla
First published: