మళ్లీ కలవబోతున్న బాహుబలి టీమ్.. ఈ సారి సూర్యుడు అస్తమించని..

మరోసారి కలవబోతున్న బాహుబలి టీమ్

బాహుబలి సినిమా టీమ్‌ అంతా సూర్యుడు అస్తమించని దేశం.. బ్రిటన్‌లో ఒకే వేదికపై సందడి చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

  • Share this:
    భారతీయ చలనచిత్ర రంగంలో కొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి సినిమాను ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే మర్చిపోలేరు. ఆ సినిమా సృష్టించిన సునామీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, కీరవాణి.. టీమ్ వర్క్‌తో ఖండాంతరాల్లో తెలుగు పరిశ్రమ గొప్ప ఘనత సాధించింది. ఇప్పుడు ఈ బృందం మరో సారి కలిసేందుకు సిద్ధమైంది. బాహుబలి 3 సినిమా తీస్తున్నారేమోనని అనుకోకండి. ఓ ప్రఖ్యాత అంతర్జాతీయ వేదికపై వీరు కలవబోతున్నారు. బాహుబలి సినిమా టీమ్‌ అంతా సూర్యుడు అస్తమించని దేశం.. బ్రిటన్‌లో ఒకే వేదికపై సందడి చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ఈ నెల 19న బాహుబలి: ద బిగినింగ్‌ సినిమాతో పాటు స్కైఫాల్‌, ‘హ్యారీపోట్టర్‌’ వంటి చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా బాహుబలి టీమ్‌ సభ్యులు ఆ వేదికపై కలవబోతున్నారు.

    19వ తేదీన సాయంత్రం 7 గంటలకు బాహుబలి సినిమాను రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించనున్నారు. కీరవాణి ఆధ్వర్యంలో అక్కడ ఓ లైవ్‌ కాన్సెర్ట్‌ కూడా జరగనుంది.

    Published by:Shravan Kumar Bommakanti
    First published: