కాలం చాలా వేగంగా వెళ్లిపోతుంది అంటే ఏమో అనుకన్నాం కానీ బాహుబలి 2 సినిమా వచ్చి అప్పుడే నాలుగేళ్లు అయిపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తుంది కానీ ఈ చిత్రం 2017 ఎప్రిల్ 28న విడుదలైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలనం విజయం సాధించడం కాదు.. ఇండియన్ సినిమాకు కొత్త లెక్కలు చూపించింది. ఇంటర్నేషన్ మార్కెట్‌లో ఇండియన్ సినిమా సత్తా చూపించింది. ప్రతీ తెలుగోడు కాలర్ ఎగరేసుకునేలా అన్ని ఇండస్ట్రీలలో జెండా పాతేసింది బాహుబలి 2. 2015లో విడుదలైన మొదటి భాగమే 500 కోట్లు వసూలు చేసింది. అప్పుడే అంతా నోరెళ్లబెట్టారు. అలాంటిది రెండేళ్ల తర్వాత వచ్చిన రెండో భాగం ఏకంగా 2000 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. తొలిరోజే 120 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది. ఇలా కలలో కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డులను బాహుబలి సృష్టించింది. ఇది చూసి బాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. నాలుగేళ్ల కింద ఈ చిత్రం ఎంత వసూలు చేసిందో ఏరియా వైజ్‌గా మరోసారి చూద్దాం..
నైజాం- 66.90 కోట్లు
సీడెడ్- 34.78 కోట్లు
ఉత్తరాంధ్ర- 26.47 కోట్లు
ఈస్ట్- 17.04 కోట్లు
వెస్ట్- 12.31 కోట్లు
గుంటూరు- 18.01 కోట్లు
కృష్ణా- 14.10 కోట్లు
నెల్లూరు- 8.04 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)-197.65 కోట్లు
కర్ణాటక- 62.00 కోట్లు
తమిళనాడు- 81.00 కోట్లు
కేరళ- 32.12 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 281.05 కోట్లు
ఓవర్సీస్- 160.28 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 814.10 కోట్లు
2017లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా 100 కోట్ల బిజినెస్ చేస్తే అమ్మో అనుకునే వాళ్లు. బాలీవుడ్ సినిమాలకు కూడా ఇదే వర్తిస్తుంది. అలాంటి ‘బాహుబలి2’ సినిమాకు మాత్రం అప్పట్లో భారతీయ సినిమాల్లో అగ్రతాంబూలం వేసారు. ఒకటి రెండు కాదు ఏకంగా 350 కోట్ల బిజినెస్ జరిగింది. ఎంత బాగున్నా ఇంతెక్కడ వస్తుందని వెక్కిరించిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ విడుదలైన తర్వాత ఒకటి రెండు కాదు.. ఏకంగా 450 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది బాహుబలి 2. కేవలం థియెట్రికల్ కలెక్షన్స్ రూపంలోనే 814 కోట్లకు పైగా వచ్చాయి. 1800 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే. ఇప్పటికీ బాహుబలి 2 రికార్డులు అలాగే ఉన్నాయి. అన్నట్లు బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు రాజమౌళి మరో సినిమా చేయనేలేదు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్‌తో బిజీగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.