Prabhas-Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ఇటలీలో మళ్లీ మొదలైంది. ఇటలీ దేశంలో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్ర షూటింగ్ కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రాధే శ్యామ్ సినిమాను కూడా రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ గా నటిస్తున్నట్టు పోస్టర్‌లో రివీల్ చేసారు.
The BIG moment has arrived!! 🔥🔥
Here's introducing #Prabhas as #Vikramaditya from #RadheShyam! 😍#RadheShyamSurprise #HappyBirthdayPrabhas
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/LAgm8xBJQw
— UV Creations (@UV_Creations) October 21, 2020
రీసెంట్‌గా పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా ఆమె ప్రేరణగా నటించబోతున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు కనబడుతోంది. పూర్వ జన్మలో ‘రాధే శ్యామ్’ గా ఉన్న హీరో, హీరోయిన్లు.. మరుసటి జన్మలో ‘విక్రమదిత్యగా, ప్రేరణగా ఉంటారనే విషయం స్పష్టమవుతోంది.
ఇక ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నట్టు సమాచారం. గతేడాది డియర్ కామ్రేడ్ సినిమాకు ఈయన సంగీతం అందించాడు. ఇప్పటి వరకు భారీ సినిమాలకు సంగీతం అందించిన అనుభవం అయితే ఈమ్యూజిక్ డైరెక్టర్‌కు లేదు కానీ రాధే శ్యామ్ సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ప్రభాస్ పుట్టినరోజు రెండు రోజులు ముందుగా ‘రాధే శ్యామ్’ నుంచి విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్‌ను విడుదల చేసారు.
ఈ సినిమాను 2021లో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్, ఓం రౌత్ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను సెట్ చేసుకున్నాడు. వీటితో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Pooja Hegde, Prabhas, Prabhas20, Radha Krishna, Radhe Shyam, Tollywood, UV Creations