• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS RADHE SHYAM TEAM REVEALED ANOTHER CRAZY UPDATE ON PRABHAS BIRTHDAY TA

Prabhas Radhe Shyam: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

Prabhas Radhe Shyam: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

ప్రభాస్ (Twitter/Photo)

Prabhas-Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. నిన్న విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా రేపు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ విడుదల చేయనున్నారు.

  • Share this:
    Prabhas-Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ఇటలీలో మళ్లీ మొదలైంది. ఇటలీ దేశంలో కరోనా   ఇంకా విజృంభిస్తూనే ఉంది. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్ర షూటింగ్ కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రాధే శ్యామ్ సినిమాను కూడా  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ గా నటిస్తున్నట్టు పోస్టర్‌లో రివీల్ చేసారు.

    Prabhas as vikramaditya in Radhe Shyam Movie in different languages,prabhas,Prabhas as vikramaditya in radhe shyam movie,prabhas as vikramaditya,prabhas twitter,prabhas birthday oct 23rd,prabhas radhe shaym movie music director justin prabhakaran,prabhas radhe shaym movie teaser on oct 23rd,justin prabhakaran prabhas,prabhas beats of radhe shayam on oct 23rd,surprise of prabhas fans,ప్రభాస్,ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్,అక్టోబర్ 23న ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్,రాధే శ్యామ్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం,విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్,రాధే శ్యామ్‌లో విక్రమాదిత్యగా ప్రభాస్
    ‘రాధే శ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ (Twitter/UV Creations/Photo)


    ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ రాధే శ్యామ్ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారో క్లారిటీ లేదు. నిన్న విడుదలైన విక్రమాదిత్యగా ఉన్న ప్రభాస్ పోస్టర్‌లో కూడా సంగీత దర్శకుడి పేరు లేదు. మిగిలిన టెక్నికల్ టీం అంతా ఉన్నారు కానీ సంగీత దర్శకుడి పేరు చెప్పలేదు. రేపు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సంగీత దర్శకుడు ఎవరనేది మధ్యాహ్నం 12.02 నిమిషాలకు ప్రకటిస్తారట. దాంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా పాటను విడుదల చేసే అవకాశమైతే ఉంది.

    ఇక ‘రాధే శ్యామ్’ సినిమాకు రాధే శ్యామ్ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు ఈయన సంగీతం అందించాడు. ఇప్పటి వరకు భారీ సినిమాలకు సంగీతం అందించిన అనుభవం అయితే ఇతనకి లేదు కానీ రాధే శ్యామ్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నట్టు సమాచారం. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ మధ్యాహ్నం 12.02 నిమిషాలకు విడుదల  కానుంది. ఈ సినిమాను 2021లో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది.మరోవైపు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా స్పెషల్‌గా ప్రభాస్ నటించిన వివిధ సినిమాల్లోని క్లిప్లింగులతో కలిపి రైస్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ఓ వీడియోను విడుదల చేసారు.

    ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను డైరెక్టర్ మారుతి, బివియస్ రవితో పాటు మరికొందరు మీడియా ప్రముఖులు కలిసి ఈ వీడియో తయారు చేయడంలో భాగం పంచుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు