Prabhas - Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు. గత కొన్ని రోజులుగా ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమా విడుదల తేదిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను జనవరి 14న ముందుగా నిర్ణయించిన తేదిలోనే థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజున ఈ సినిమా థియేటర్స్‌లో రావడం పక్కా అంటున్నారు. ఇక ఇదే పండుగను టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వస్తోంది. మరోవైపు మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా సంక్రాంతి వస్తోందని ప్రకటించారు. వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్ 3 కూడా అదే పండుగకు రానుందని తెలుస్తోంది. దీంతో ఈసారి సంక్రాంతి పోరు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ రాధే శ్యామ్ విషయానికి వస్తే.. కరోనా సెకండ్ వేవ్ లెకపోయింటే ‘రాధే శ్యామ్’ జూలై 30న అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఉండేది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
#RadheShyam release date remains unaffected, film to release on 14th January 2022 #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @UVKrishnamRaju #Vamshi #Pramod @justin_tunes @RadheShyamFilm #RadheShyamOnJan14th pic.twitter.com/41l4GaBSu1
— BA Raju's Team (@baraju_SuperHit) September 29, 2021
రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించారు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
Super Star Krishna : అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ మూవీ తెలుసా..
ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో మూడు ప్యాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నారు. ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ’ప్రాజెక్ట్ K’ సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తోంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో ఈ సినిమా షూట్‌ను స్టార్ట్ చేసారు.
ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు ప్రభాస్. ఆల్మొస్ట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లంకేశుడి పాత్రలో పాత్రలో కనిపించనున్నారు. దాంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తైయింది. . ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్’గా చేస్తోంది. మరో హీరోయిన్‌గా వాణీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్‌కు రీమేక్‌గా వస్తుందని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gopi Krishna Movies, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood, UV Creations