హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ శుభ తరుణం రానే వచ్చింది..

Prabhas : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ శుభ తరుణం రానే వచ్చింది..

రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ ఉంది కానీ ఒకప్పుడు మాత్రం కేవలం తెలుగు హీరోనే. ఇక్కడే పరిమితం అయిపోయి సినిమాలు చేసాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ పెరిగిపోయింది. ఈయన కెరీర్ కొత్తలో చేసిన కొన్ని సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. మరీ ముఖ్యంగా ఒక సినిమా గురించి చెప్పుకోవాలి. ఛత్రపతి లాంటి సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ వేసిన అడుగులు దారుణంగా ఉన్నాయని ఆయన అభిమానులే బాధ పడుతుంటారు.

రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ ఉంది కానీ ఒకప్పుడు మాత్రం కేవలం తెలుగు హీరోనే. ఇక్కడే పరిమితం అయిపోయి సినిమాలు చేసాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ పెరిగిపోయింది. ఈయన కెరీర్ కొత్తలో చేసిన కొన్ని సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. మరీ ముఖ్యంగా ఒక సినిమా గురించి చెప్పుకోవాలి. ఛత్రపతి లాంటి సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ వేసిన అడుగులు దారుణంగా ఉన్నాయని ఆయన అభిమానులే బాధ పడుతుంటారు.

Prabhas : ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌‌తో పాటు ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది టీమ్. ఈ ఈవెంట్‌ను డిసెంబర్ 23న అంటే రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్‌కు రాజమౌళి హాజరు కానున్నారని అంటున్నారు.

ఇంకా చదవండి ...

  Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌‌తో పాటు ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది టీమ్. ఈ ఈవెంట్‌ను డిసెంబర్ 23న అంటే రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్‌కు రాజమౌళి హాజరు కానున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్‌‌కు ప్రభాస్‌తో సినిమాలు చేయబోయే డైరెక్టర్స్ అందరూ హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ ఈవెంట్‌ను నవీన్ పొలిశెట్టి హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఇదే ఈవెంట్‌లో రాధేశ్యామ్ ట్రైలర్‌ను అన్ని భాషాల్లో విడుదల చేయనుంది టీమ్. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు.

  ఇక  ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో వరుసగా పాటలను విడుదల చేస్తోంది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను గత నెల 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ నగుమోము తారలే కూడా చిత్రబృందం విడుదల చేసింది చిత్రబృందం. ఇక మూడో సాంగ్‌ “సంచారి పాటను కూడా రిలీజ్ చేసింది. ఈ పాటను అనిరుధ్ రవిచంద్రన్ పాడారు.

  జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సంక్రాంతి బరిలో రాధేశ్యామ్‌తో పాటు ఆర్ ఆర్ ఆర్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు విడుదలకానున్నాయి. ఇక 'సాహో' తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. దీనికి తోడు వరుస హిట్లతో ఉన్న పూజ హెగ్డే నుంచి కొత్త ఏడాదిలో వస్తున్న మొదటి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారని తెలుస్తోంది.

  ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఆ మధ్య ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. రాధే శ్యామ్ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించిందనే చెప్పోచ్చు. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. రాధే శ్యామ్ తెలుగు టీజర్ టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులను చెరిపివేసింది. ఈ టీజర్ విడుదలైన కేవలం 20 గంటల్లోనే, యూట్యూబ్‌లో 35 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని సాధించింది. టీజర్‌కు కూడా అర మిలియన్‌కు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇక ఈ టీజర్‌లో ప్రభాస్ చేసిన విక్రమ్ ఆదిత్య పాత్రను పరిచయం చేశారు. ప్రభాస్ పాత్రను ఓ లెవల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల భవిష్యత్తు చెప్పే వాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే ప్రేరణ పాత్రలో పూజా కనపడనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  Pushpa | Allu Arjun : చెన్నైలో పుష్ప టీమ్ సక్సెస్ సంబరాలు.. పిక్స్ వైరల్..

  ఇక ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిసింది. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spririt) అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్‌ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood news

  ఉత్తమ కథలు