Home /News /movies /

PRABHAS RADHE SHYAM MUSIC DIRECTOR THAMAN INTERESTING TWEET ABOUT RADHE SHYAM MOVIE RELEASE TA

Prabhas : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ విడుదలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ పై తమన్ ట్వీట్ (Twitter/Photo)

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ పై తమన్ ట్వీట్ (Twitter/Photo)

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...
  Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది.  ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానుల రచ్చ మొదలైంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’.పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. ఇక  సంక్రాంతికి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే కరోనా కారణంగా థియేటర్స్‌లో సగం ఆక్యుపెన్షీ తదితర కారణాల వల్ల ఈ సినిమా విడుదలను అనివార్యంగా వాయిదా వేయాల్సి చ్చింది.

  . ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా  కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. మరోవైపు ఒకప్పటి హీరోయిన్ భాగ్యశ్రీ ఈ చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించింది.  పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్.. గతంలో ‘బిల్లా’, ‘రెబల్’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇపుడు ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ మధ్య ‘రాధే శ్యామ్’కు ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 400 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చింది. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తే నిర్మాతలకు ఈ అమౌంట్ ఇస్తామంటూ బంపరాఫర్ ఇచ్చింది.

  Major - Adivi Sesh : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో అడివి శేష్ మర్యాద పూర్వక భేటి..

  కానీ రాధేశ్యామ్ మూవీ మేకర్స్... భారీ సెట్టింగ్స్.. గ్రాండ్ విజువల్స్.. మేకింగ్‌తో పాటు భారీ సౌండ్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ కూడా ఇదే విషయాన్ని మరో సారి ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ ట్వీట్ చేసారు. ఈ చిత్రాన్ని డాల్బీ అట్మాస్పియర్‌లో 3D ఐమాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కించారు.


  ‘రాధే శ్యామ్’లో 1970 నాటి ఇట‌లీ చాయాలు సినిమాలో అలా దించేశారు ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్. సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి సినిమాలో ఆర్ట్ అంశాల‌పైనే సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి న్యూస్ 18 ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద్ర‌ర్ ను సంప్ర‌దించి. సినిమాకి ఎలా వ‌ర్క్ చేశారు. 1970 లో నాటి ఇట‌లీని మ‌ళ్లీ రీ క్రియేట్ చేసారు.

  Nani - Shyam Singha Roy : నాని ‘శ్యామ్ సింగరాయ్’ మరో అరుదైన రికార్డ్.. అక్కడ ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క భారతీయ మూవీ..

  పాన్-ఇండియా ప్రాజెక్ట్ రాధే శ్యామ్ కోసం సరైన లొకేషన్‌లను గుర్తించడం, అద్భుతమైన సెట్‌లను రూపొందించడం విజువల్ ఎలిమెంట్స్‌ను చాలా శ్రమతో కూడుకున్న ప‌ని.రాధే శ్యామ్ ప్రొడక్షన్ డిజైనర్ కావడం రవీందర్‌కి చాలా భిన్నమైన అనుభవం అనే  చెప్పుకోవాలి.ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల భవిష్యత్తు చెప్పే వాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే ప్రేరణ పాత్రలో పూజా కనపడనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది.

  Chiranjeevi -Pawan Kalyan - Ram Charan: చిరంజీవి బాటలో తొలిసారి ఆ తరహా పాత్రల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ ఖుషీ..

  సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రభాస్.. ‘రాధే శ్యామ్’తో పాటు ‘ఆదిపురుష్’, సలార్’ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్స్ కంప్లీటయ్యాయి. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత హిందీలో కరణ్ జోహార్ నిర్మాణంలో సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Prabhas, Radhe Shyam, Thaman, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు