Prabhas - Salman Khan: సల్మాన్ ఖాన్ దారిలో ప్రభాస్.. ఆ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

ప్రభాస్ సల్మాన్ ఖాన్ (Prabhas Salman Khan)

ప్రభాస్(Prabhas) సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు హీరోగానే ఉండిపోవాలని అస్సలు అనుకోవడం లేదు ప్రభాస్. తాజాగా ఈయన రాధే శ్యామ్(Radhe Shyam) సినిమా విడుదల విషయంలో కొన్ని కొత్త వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
ప్రభాస్ సినిమాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ఈయన తన స్థాయి పెంచుకుంటున్నాడు. తెలుగు హీరోగానే ఉండిపోవాలని అస్సలు అనుకోవడం లేదు ప్రభాస్. అందుకే ఎంచుకుంటున్న కథలు.. చేస్తున్న సినిమాలు.. అవి జరుపుకుంటున్న బిజినెస్ అన్నీ పాన్ ఇండియన్ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పట్లో ప్రభాస్ రేంజ్ ముట్టుకోవడం కూడా కష్టమే. సినిమాకు 100 కోట్ల పారితోషికం అందుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ఈయన. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే తాజాగా ఈయన తన రాధే శ్యామ్ సినిమా విషయంలో సల్మాన్ ఖాన్ రూట్ ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంటే ఈ సినిమాను నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు థియేటర్స్‌లో కూడా ఒకేరోజు విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో మొన్న ఈద్ సందర్భంగా విడుదలైన రాధే సినిమాను ఇలాగే విడుదల చేసారు.

థియేటర్లతో పాటు డిజిటల్‌లోనూ ఒకేరోజు విడుదల చేసారు. అయితే అప్పుడు లాక్ డౌన్ కావడంతో కేవలం ఓటిటికే పరిమితం అయిపోయింది భాయ్ సినిమా. అయితే పే ఫర్ వ్యూ పద్దతి టాలీవుడ్ నిర్మాతలను కూడా ఆకట్టుకుంటుంది.
prabhas,prabhas twitter,prabhas instagram,prabhas movies,prabhas radhe shyam,prabhas radhe shyam ott release,prabhas radhe shyam ott release radhe salman khan,telugu cinema,సల్మాన్ ఖాన్ దారిలో ప్రభాస్,రాధే శ్యామ్ ఓటిటి రిలీజ్,ప్రభాస్ సినిమా ఓటిటిలో
రాధే శ్యామ్ (radhe shyam)

అందుకే ఇప్పుడు ప్రభాస్ సినిమాను కూడా దేశవ్యాప్తంగా ఇలాగే విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు జీ సంస్థతో యువీ క్రియేషన్స్ మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా విడుదలపై ఓ క్లారిటీ రానుంది. ఒక్కటి మాత్రం నిజం.. ప్రభాస్ లాంటి హీరో సినిమాను ఓటిటిలో విడుదల చేస్తే మాత్రం అంతకంటే సంచలనం మరోటి ఉండదు.
prabhas,prabhas twitter,prabhas instagram,prabhas movies,prabhas radhe shyam,prabhas radhe shyam ott release,prabhas radhe shyam ott release radhe salman khan,telugu cinema,సల్మాన్ ఖాన్ దారిలో ప్రభాస్,రాధే శ్యామ్ ఓటిటి రిలీజ్,ప్రభాస్ సినిమా ఓటిటిలో
రాధే శ్యామ్ (radhe shyam)

థియేటర్స్ ఉన్నా కూడా డిజిటల్ రిలీజ్ చేస్తే.. ప్రేక్షకులు కూడా కరోనాను దాటి బయటికి వెళ్లరు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని సినిమా చూస్తారు. మరి అలా చేస్తే థియేటర్స్‌కు ఎంత నష్టం వస్తుందనేది కూడా అంచనాలు వేయలేరు. ఏదేమైనా కూడా రాధే శ్యామ్ ఎలా విడుదల కానుందనే విషయంపై కొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది.
Published by:Praveen Kumar Vadla
First published: