హోమ్ /వార్తలు /movies /

Radhe Shyam Movie Review : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ రివ్యూ.. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్..

Radhe Shyam Movie Review : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ రివ్యూ.. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్..

Radhe Shyam Movie Review | రెబల్ స్టార్  ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019 సాహో తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. పీరిడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. పూజ ాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరో ముఖ్యపాత్రలో అలరించారు. రెండేళ్ల లాంగ్ తర్వాత థియేటర్స్‌లో వచ్చిన ప్రభాస్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నారా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

ఇంకా చదవండి ...

  రివ్యూ : రాధే శ్యామ్

  నటీనటులు : కృష్ణంరాజు, ప్రభాస్, పూజా హెగ్డే, జగపతి బాబు, భాగ్యశ్రీ, మురళీ శర్మ తదితరులు

  సంగీతం : జస్టిన్ ప్రభాకర్

  ఆర్ ఆర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : ఎస్.ఎస్. థమన్

  ఎడిటర్ : కోటగిరి వేంకటేశ్వర రావు

  సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస

  నిర్మాణం: గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్

  నిర్మాతలు :  వంశీ, ప్రమోద్, ప్రసీదా                                                                                                  దర్శకత్వం : రాధా కృష్ణ కుమార్

  రెబల్ స్టార్  ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019 సాహో తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. పీరిడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. పూజ ాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరో ముఖ్యపాత్రలో అలరించారు. రెండేళ్ల లాంగ్ తర్వాత థియేటర్స్‌లో వచ్చిన ప్రభాస్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నారా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..

  కథ:

  విక్రమ్ ఆదిత్య (ప్రభాస్) పాపులర్ హస్త సాముద్రికుడు. ఆయన చెప్పిన జ్యోతిష్యం వందకు వంద శాతం నిజం అవుతుంది. తన జీవితంలో ప్రేమ లేదని తెలుసుకొని వాటికి దూరంగా ఉండే విక్రమాదిత్య జీవితంలోకి డాక్టర్ ప్రేరణ (పూజ హెగ్డే) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడకూడదు అనుకుంటూనే పడిపోతాడు విక్రమాదిత్య. అయితే తన జాతకంలో ప్రేమకు చోటు లేదని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆదిత్య ప్రేరణ కలుసుకున్నారా లేదా.. వాళ్ళ కథ ఎలా ముగిసింది అనేది కథ..

  కథనం:

  జ్యోతిష్యం నమ్మాలా వద్దా.. సైన్సు ఇంత అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా జ్యోతిష్యం ఎందుకు నమ్మాలి..? అని అడిగే వాళ్ళు కొందరు.. సైన్స్ కూడా జ్యోతిష్య నుంచే పుట్టింది కదా.. ఎందుకు నమ్మకూడదు.. ఈ రెండు ప్రశ్నల చుట్టూ తిరిగే కథ రాధే శ్యామ్. విధికి, ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ. సినిమాను ఓపెన్ చేయడం చాలా అద్భుతంగా చేశాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ప్రభాస్ జ్యోతిష్యం గొప్పతనం చెప్పడానికి ఇందిరా గాంధీ సీన్ రాసుకున్నాడు. అయితే ఆ తర్వాత స్లో నేరేషన్ చాలా ఇబ్బంది పెట్టింది. పైగా మాస్ యాక్షన్ సినిమాల్లో చూసిన ప్రభాస్ ను పూర్తిస్థాయి లవర్ బాయ్ గా చూడడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. మధ్యలో కొన్ని కొన్ని మంచి సన్నివేశాలు పడిన కూడా.. వాటిని పూర్తిగా క్యాష్ చేసుకోవడంలో విఫలం అయ్యాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ముఖ్యంగా హాస్పిటల్ లో ప్రభాస్, పూజ హెగ్డే మధ్య వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.

  పూజ గురించి ఒక నిజం తెలిసిన తర్వాత ఇంటర్వెల్ వరకు రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా కాసేపు సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. మళ్లీ కొన్ని సన్నివేశాలు మధ్యలో బాగా ఇబ్బంది పెడతాయి. ప్రేమకి, విధాతకు మధ్య జరిగే సంఘర్షణ అని ముందుగానే చెప్పాడు కాబట్టి.. సన్నివేశాలు కూడా అలాగే అల్లుకున్నాడు దర్శకుడు. మధ్యలో జ్యోతిష్యం గొప్పది అని చెప్పడానికి జగపతి బాబు సన్నివేశంతో పాటు.. హాస్పిటల్లో మరో మంచి సీన్లు కూడా రాసుకున్నాడు దర్శకుడు. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి అదే జాతకం 100% నిజం కాదు అని ఆయనే చెప్పాడు. ముందు నుంచి జ్యోతిష్యం కరెక్ట్.. అందులో ఉన్న అదే జరుగుతుంది అని చెప్పే ప్రభాస్ చివరికి వచ్చేసరికి అది నిజం కాదు అని ఒప్పుకుంటాడు. దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. క్లైమాక్స్ సన్నివేశాలు బాగున్నాయి. ఓవరాల్ గా రాధే శ్యామ్ విజువల్ పరంగా అద్భుతంగా ఉంది.. కానీ కథ పరంగా చూసుకుంటే మాత్రం స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది.

  ప్లస్ పాయింట్స్ 

  క్లైమాక్స్

  ఆర్ట్ వర్క్

  ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీ

  మైనస్..

  స్లో నేరేషన్

  ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్

  అక్కడక్కడ లోపించిన సీజే వర్క్స్

  రేటింగ్.. 2.75/5

  చివరి మాట : కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ

  (Review By Praveen Kumar Vadla)

  First published:

  ఉత్తమ కథలు