ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే చేస్తోంది. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఇప్పటికే షూటింగ్స్‌కు సంబంధించిన పర్మిషన్స్ కూడా చిత్ర యూనిట్ తీసుకుందని సమాచారం. ఈ చిత్రంలో పూజా హెగ్డే టీజర్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాలో పూజా హెగ్డే, అక్షయ్ కుమార్ సహా పలువురు రెండు పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే కదా. మరి ప్రభాస్ కూడా ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటిస్తున్నాడా అనేది మాత్రం సస్పెన్స్ అంటున్నారు. ఈ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు మరో వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
‘రాధే శ్యామ్’ ప్రభాస్ .. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సోషియో ఫాంటసీ నేపథ్యంలో దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.మరోవైపు ప్రభాస్.. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాణంలో డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మరో హీరోగా హృతిక్ రోషన్ నటించబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా కంటే ముందు ప్రభాస్.. కేజీఎఫ్'తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nag Ashwin, Pooja Hegde, Prabhas, Radha Krishna, Radhe Shyam, Tollywood