Home /News /movies /

PRABHAS RADHE SHYAM LATEST UPDATE IN FEW HOURS FANS VERY EAGER TO WAIT FOR RADHE SHYAM UPDATE TA

Prabhas - Radhe Shyam : ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ‘రాధే శ్యామ్’ మూవీపై మరికొన్ని గంటల్లో క్రేజీ అప్‌డేట్..

రాధే శ్యామ్ (radhe shyam)

రాధే శ్యామ్ (radhe shyam)

Prabhas - Radhe Shyam : ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ‘రాధే శ్యామ్’ మూవీపై మరికొన్ని గంటల్లో క్రేజీ అప్‌డేట్ ఇవ్వనున్నారు.

  Prabhas - Radhe Shyam : ప్రభాస్ అభిమానులకు శుభవార్త.. ‘రాధే శ్యామ్’ మూవీపై మరికొన్ని గంటల్లో క్రేజీ అప్‌డేట్ ఇవ్వనున్నారు. కరోనా సెకండ్ వేవ్ లెేకపోయి అంతా సవ్యంగా సాగిపోతే  ‘రాధే శ్యామ్’ మరికొన్ని గంటల్లో (జూలై 30)న విడుదలై ఉండేది. కానీ కరోనాతో అంతా తలకిందలు అయింది. ప్రభాస్ సరసన  పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వస్తోంది. దీనికి తోడు సాహో సినిమా తర్వాత.. ప్రభాస్ చేస్తోన్న సినిమా ఇది కావడంతో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాను సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ గురువారమే  ఈ సినిమా షూటింగ్  పార్ట్ కంప్లీట్ కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్.

  ఇక ఈ సినిమా విడుదల కావాల్సిన జూలై 30 శుక్రవారం రోజున ఉదయం 9 గంటల 18 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. బహుశ ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించే అవకాశాలున్నాయని చెప్పొచ్చు.  ప్రభాస్ సన్నిహిత వర్గాల కథనం ప్రకారం.. ‘రాధే శ్యామ్’ సినిమాను ‘ఛత్రపతి’ సినిమా విడుదలైన సెప్టెంబర్ 30న విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆ డేట్ అయితే.. సెంటిమెంట్‌గా వర్కౌట్ అవడమే కాకుండా.. ఏ సినిమా కూడా పోటీలో ఉండదు. అందుకే ఆ డేట్‌ను లాక్ చేసినట్టు చెబుతున్నారు.మరి అదే రోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా ? లేకపోతే సంక్రాంతికి పోస్ట్‌పోన్ చేస్తారా అనేది చూడాలి. మొత్తంగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ పై సాలిడ్ అప్డేట్ కోసం మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.

  ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ (Twitter/Photo)


  ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించారు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.  ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా చేస్తున్నాడు. ఐతే ఫైనల్ గా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ డీల్స్ కంప్లీట్ అయ్యినట్టు తాజా సమాచారం. ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీ (Radhe Shyam on Zee5) జీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిస్తోంది.

  Prabhas and Pooja Hegde Radhe Shyam completes the shooting, Radhe Shyam on Zee5, Radhe Shyam ott release, Radhe Shyam video, Radhe Shyam released date, Radhe Shyam Teaser,Radhe Shyam Release Date, radhe shaym movie music director justin prabhakaran, ప్రభాస్,ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్, జస్టిన్ ప్రభాకరన్
  రాధే శ్యామ్ Radheshyam Photo : Twitter


  ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ’ప్రాజెక్ట్ K’ సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కే  సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు.  ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో ఈ సినిమా షూట్‌ను స్టార్ట్ చేసారు.

  Prabhas Nag Ashwin film project k started, Prabhas Nag Ashwin film launching, Prabhas Nag Ashwin film latest update, Prabhas Prashanth Neel SALAAR movie, SALAAR movie, SALAAR,prabhas news, KGF director Prashanth Neel, Adipurush Update release date, nag ashwin about prabhas next movie, nag ashwin prabhas movie,deepika padukone,nag ashwin, ప్రభాస్, దీపికా పదుకొనే, prashanth neel,ప్రశాంత్ నీల్
  ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబో 'ప్రాజెక్ట్‌ కె’


  ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్నారు.  ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లంకేశుడి పాత్రలో  పాత్రలో కనిపించనున్నారు.  కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సలార్ పేరుతో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్టు సమాచారం.  ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్’గా చేస్తోంది. మరో హీరోయిన్‌గా వాణీ కపూర్ నటిస్తోంది. దాంతో పాటు ప్రభాస్ పలు క్రేజీ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టినట్టు సమాచారం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radha Krishna Kumar, Radhe Shyam, Tollywood, UV Creations

  తదుపరి వార్తలు