Prabhas Radhe Shyam Italy Schedule Completed : ‘బాహుబలి’ సిరీస్‌తో హీరోగా ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. అంతేకాదు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా వివిధ దేశాల్లో కూడా విడుదల చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. దీంతో హీరోగా ప్రభాస్ క్రేజ్ గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. రష్యా ,జపాన్, చైనా వంటి దేశాల్లో కూడా బాహుబలి ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత ప్రభాస్ సాహో సినిమాతో పలకరించాడు. ఈ సినిమా తెలుగులో సరిగా ఆడలేదు. కానీ హిందీ బెల్ట్‌లో మాత్రం ఈ సినిమా ఇరగదీసింది. దాదాపు రూ. 200 కోట్లను కొల్లగొట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ ఇటలీలో స్టార్ట్ చేసారు. అక్కడ మీడియా కూడా ఈ సినిమాపై స్పెషల్ కవరేజ్ కూడా ఇచ్చింది. తాజాగా ఇటలీలో ‘రాధే శ్యామ్’ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తైయింది. ప్రస్తుతం అక్కడ కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఈ సందర్భంగా ఇటలీ షెడ్యూల్‌ను తొందరగానే కంప్లీట్ చేసారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. తర్వాత షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేసారు. ఈ సందర్భంగా ఇటలీలో చివరి షెడ్యూల్ రోజున కారు పక్కన రాజసంగా ప్రభాస్ దిగిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rebel Star #Prabhas from the sets of Pan India Film #RadheShyam pic.twitter.com/beUcxP1Q6v
— BARaju (@baraju_SuperHit) November 4, 2020
రాధే శ్యామ్ సినిమాను దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేసిన విక్రమాదిత్యగా లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రభాస్, పూజా హెగ్డేల మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
‘రాధే శ్యామ్’ సినిమాకు రాధే శ్యామ్ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు ఈయన సంగీతం అందించాడు. ఇప్పటి వరకు భారీ సినిమాలకు సంగీతం అందించిన అనుభవం అయితే ఇతనకి లేదు కానీ రాధే శ్యామ్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో ఇటలీ బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Italy, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood