హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas | Radhe Shyam : రాధేశ్యామ్ కలెక్షన్స్ విషయంలో నిర్మాతలు ఫుల్ హ్యాపీ..

Prabhas | Radhe Shyam : రాధేశ్యామ్ కలెక్షన్స్ విషయంలో నిర్మాతలు ఫుల్ హ్యాపీ..

Prabhas Pooja Hegde Photo : Twitter

Prabhas Pooja Hegde Photo : Twitter

Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం (Radhe Shyam) రాధేశ్యామ్. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు దాటింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం ప్రభాస్ ఇమేజ్ కారణంగా మొదటి మూడు రోజులు బాగానే వచ్చాయి.

ఇంకా చదవండి ...

    Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం (Radhe Shyam) రాధేశ్యామ్. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు దాటింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం ప్రభాస్ ఇమేజ్ కారణంగా మొదటి మూడు రోజులు బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా.. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 151 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు రాధేశ్యామ్ టీమ్. ఇక్కడ మరో విషయం ఏమంటే.. ఈ సినిమా ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి ప్రవేశించిందని తెలుస్తోంది. రాధే శ్యామ్ కోసం నిర్మాతలు యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుండి తెలిసింది. ఇందులో డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ నుంచే దాదాపు రూ.200 కోట్లు పెట్టుబడి తిరిగి వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తంలో డబ్బు చెల్లించిందట. ఇక మిగిలింది థియేట్రికల్ కలెక్షన్స్ నుండి రాబట్టాలి. కాగా ఇప్పటికే మూడు రోజుల్లో ఆ మొత్తం వచ్చేసింది. దీంతో రాధే శ్యామ్ విషయంలో నిర్మాతలు సూపర్ హ్యాపీగా ఉన్నారట.

    ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్స్‌ను దాటింది. దీంతో ప్రభాస్ ఖాతాలో వన్ మిలియన్ క్రాస్ చేసిన నాలుగోవ సినిమాగా రాధేశ్యామ్ నిలిచింది. గతంలో ఆయన నటించిన బాహుబలి, బాహుబలి 2, సాహోలు ఈ రికార్డ్స్‌ను నమోదు చేశాయి. ఈ సినిమాకు థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. పిరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా వస్తోన్న ఈ చిత్రాన్ని దాదాపు 250కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు ఇక్కడి సౌత్ భాషలకు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌ణ్ సంగీతం అందించ‌గా హిందీకి మాత్రం స‌చిత్ బ‌ల్హరా, అంకిత్ బ‌ల్హ‌రా, మితున్, అమ‌ల్ మాలీక్, మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని అందించారు. రాధా క‌ృష్ణ దర్శకత్వం వహించారు.

    ఇక ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేమ్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ (Spririt) అంటూ అప్పుడే టైటిల్‌ను కూడా ప్రకటించారు. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. టైటిల్‌ లోగోను బట్టి ఈ సినిమాలో పోలీసుల గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్, ఓమ్ రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ ఉన్నాయి.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood news

    ఉత్తమ కథలు