Choose Municipal Ward
  CLICK HERE FOR DETAILED RESULTS

  Prabhas : రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల.. మనోహరంగా ప్రభాస్ పూజా హెగ్డే..

  Prabhas : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈరోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ నుంచి ఓ మెలోడి సాంగ్‌‌తో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

  news18-telugu
  Updated: October 23, 2020, 12:34 PM IST
  Prabhas : రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల.. మనోహరంగా ప్రభాస్ పూజా హెగ్డే..
  రాధేశ్యామ్‌లో ప్రభాస్, పూజా హెగ్డే Photo : Twitter
  • Share this:
  Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ వంటి స్టార్‌తో ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా లేటైనా ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ఇటలీలో మళ్లీ మొదలైంది. ఇటలీ దేశంలో కరోనా   ఇంకా విజృంభిస్తూనే ఉంది. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్ర షూటింగ్ కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రాధే శ్యామ్ సినిమాను కూడా  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ గా నటిస్తున్నట్టు పోస్టర్‌లో రివీల్ చేసారు.

  Prabhas as vikramaditya in Radhe Shyam Movie in different languages,prabhas,Prabhas as vikramaditya in radhe shyam movie,prabhas as vikramaditya,prabhas twitter,prabhas birthday oct 23rd,prabhas radhe shaym movie music director justin prabhakaran,prabhas radhe shaym movie teaser on oct 23rd,justin prabhakaran prabhas,prabhas beats of radhe shayam on oct 23rd,surprise of prabhas fans,ప్రభాస్,ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్,అక్టోబర్ 23న ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్,రాధే శ్యామ్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం,విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్,రాధే శ్యామ్‌లో విక్రమాదిత్యగా ప్రభాస్
  ‘రాధే శ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ (Twitter/UV Creations/Photo)


  ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ రాధే శ్యామ్ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారో క్లారిటీ లేదు. నిన్న విడుదలైన విక్రమాదిత్యగా ఉన్న ప్రభాస్ పోస్టర్‌లో కూడా సంగీత దర్శకుడి పేరు లేదు. మిగిలిన టెక్నికల్ టీం అంతా ఉన్నారు కానీ సంగీత దర్శకుడి పేరు చెప్పలేదు.  కాగా ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా  మధ్యాహ్నం 12.02 నిమిషాలకు ఓ పాటతో కూడిన మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. అందులో ఓ ట్రైన్‌ ఆ ట్రైన్‌లో రొమాంటిక్‌గా ప్రభాస్ పూజా హెగ్డేలు అదరగొట్టారు.

  ఇక ‘రాధే శ్యామ్’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అన్న ప్రశ్నకు ఈరోజు సమాధానం చెప్పింది చిత్రబృందం. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నట్లు పేర్కోంది. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటి వరకు భారీ సినిమాలకు సంగీతం అందించిన అనుభవం అయితే జస్టిన్ ప్రభాకరన్ లేదు. ఇక ఈ సినిమాను 2021లో విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.

  ఈ చిత్రానికి సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉండటంతో మొదట సంగీత దర్శకుడిగా కీరవాణిని తీసుకుంటున్నారని గతంలో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు.. ఇప్పుడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పేరు వినబడుతోంది. రెహమాన్ ఇటీవల కాలంలో తెలుగులో ఏ సినిమా చేయలేదు. అంతేకాదు ఆయన ఒక తమిళ్‌లో తప్ప ఏ భాషాల్లోను ఎక్కువుగా సంగీతం అందిచట్లేదు. ఆయన చేసిన చివరి హిందీ సినిమా. దిల్ బెచారా.. నాగ్ అశ్విన్ తన సినిమాకు రెహమాన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. రెహమాన్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువే అయినా.. ఆయన ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ దక్కుతుందనే నమ్మకంతో చిత్రబృందం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
  Published by: Suresh Rachamalla
  First published: October 23, 2020, 12:24 PM IST
  మరిన్ని చదవండి
  తదుపరి వార్తలు

  Top Stories

  corona virus btn
  corona virus btn
  Loading