హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam 6 WW Days Collections : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 6 డేస్ కలెక్షన్స్.. ఏంది సామి ఈ కలెక్షన్లు..

Radhe Shyam 6 WW Days Collections : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 6 డేస్ కలెక్షన్స్.. ఏంది సామి ఈ కలెక్షన్లు..

Radhe Shyam 5 Day World Wide Collections : ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు మొదటి రోజు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. నాలుగో రోజు అయినా సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్‌లో దారుణమైన డ్రాప్స్ కనపడుతున్నాయి. ఆరో రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రాధే శ్యామ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. మొత్తంగా ఈ బుధవారం వరకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఇంకా చదవండి ...

  Radhe Shyam 6 Days World Wide Collections : ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు మొదటి రోజు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హిందీలోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు అక్కడ కేవలం రూ. 2.4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. రెండో రోజు మాత్రం రూ. 2.05 కోట్లు మాత్రమే వసూళు చేసింది. ఆరు రోజుల్లో కలిపి రూ. 8.40 కోట్ల షేర్.. (రూ. 21 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.  ఒక రకంగా ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌కు ఇదే పెద్ద దెబ్బ అనే చెప్పాలి.  మరోవైపు మిగిలిన రాష్ట్రాలలో సైతం ఈ సినిమాకు ఊహించిన కలెక్షన్స్ అయితే రాలేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రికార్డు కూడా క్రియేట్ చేయలేక చతికిలబడింది.

  ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూడటానికి ప్రేక్షకులు అస్సలు ఇష్టపడలేదని ఈ సినిమా వసూళ్లతో అర్థమవుతుంది. ఒక్కసారి ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి.. రెండో రోజు తెలంగాణ, ఆంధ్ర  ప్రదేశ్‌లో రూ. 12.32 కోట్లు షేర్ మాత్రమే వసూళు చేసింది. మూడో  రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.58 కోట్లు.. నాలుగో రోజు.. దారుణంగా పడిపోయి.. కేవలం రూ. 2.11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఐదో రోజు.. రూ. 1.14 కోట్లు మాత్రమే వచ్చింది.  ఆరో రోజు కేవలం రూ. 63 లక్షలు మాత్రమే వసూళు చేసింది.  ఓవరాల్‌గా ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 52.27 కోట్లు (రూ. 81.50 కోట్ల గ్రాస్) వసూళ్లు వచ్చాయి.  వసూళు చేసింది. హిందీ, ఓవర్సీస్ సహా మిగిలిన అన్ని ఏరియాల్లో కలిపి రూ. 57 లక్షలను మాత్రమే వసూళు చేసింది.  ఆరు రోజుల్లో  మొత్తంగా రూ. 26.13  కోట్లు మాత్రమే వసూళ్లును  దక్కించుకుంది. మొత్తంగా ఆరో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.20 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా  ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే..

  The Kashmir Files : ’ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీపై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ ట్వీట్..

  నైజాం (తెలంగాణ): రూ. 24.05 కోట్లు / రూ. 36.50 కోట్లు

  సీడెడ్ (రాయలసీమ): రూ. 7.19 కోట్లు / రూ . 18 కోట్లు

  ఉత్తరాంధ్ర: రూ. 4.64 కోట్లు  / రూ. 13 కోట్లు

  ఈస్ట్: రూ. 4.16 కోట్లు / రూ. 8.80 కోట్లు

  వెస్ట్: రూ. 3.21 కోట్లు / రూ. 7.50 కోట్లు

  గుంటూరు: రూ. 4.35 కోట్లు / రూ. 9.90 కోట్లు

  కృష్ణా: రూ. 2.59 కోట్లు / రూ. 7.50 కోట్లు

  నెల్లూరు: రూ. 2.08 కోట్లు / రూ. 4 కోట్లు

  తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 52.27 కోట్లు (రూ. 81.50 కోట్లు గ్రాస్)  / రూ.  105.20 కోట్లు

  కర్ణాటక: రూ. 4.18 కోట్లు / రూ. 12.50 కోట్లు

  తమిళనాడు: రూ. 0.73 కోట్లు /  రూ. 6 కోట్లు

  కేరళ: 0.17 కోట్లు / రూ. 2.10 కోట్లు

  హిందీ: రూ. 8.40 కోట్లు / రూ. 50 కోట్లు

  రెస్టాఫ్ ఇండియా: రూ. 1.55 కోట్లు /  రూ. 3 కోట్లు

  ఓవర్సీస్ : రూ. 11.10 కోట్లు / రూ. 24 కోట్లు

  ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 78.40 కోట్లు (రూ. 140.50) / రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

  Bollywood Heroes in South: తెలుగు సినిమాల్లో హిందీ హీరోల దందా.. అజయ్, సల్మాన్ సహా సౌత్‌ ఇండస్ట్రీకి క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోలు..

  ఆరు రోజుల కలెక్షన్స్ చూస్తే.. ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీ నష్టాలు తప్పేలా కనపడటం లేదు.  ఈ  ఫ్లో చూస్తుంటే.. ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్‌లో ఈ సినిమా నిలవవచ్చు. పెట్టిన పెట్టుబడికి పావు వంతు మాత్రమే రికవరీ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీలో ఇంకా రూ. 42 కోట్ల టార్గెట్‌ను రీచ్ కావాలి.‘సాహో’ విషయానికొస్తే.. ఈ సినిమాకు తెలుగులో కంటే హిందీ బెల్ట్‌లో ఓ ఊపు ఊపింది. అలాంటి రాధే శ్యామ్ విషయానికొచ్చే వరకు అంతా తలకిందులైంది.  మొత్తంగా ‘రాధే శ్యామ్’ హిట్ అనిపించుకోవాలంటే  రూ. 125.60 కోట్లు రాబట్టాలి. ఈ మూవీ బాక్సాఫీస్ పరుగు సోమవారం నుంచి దారుణంగా పడిపోయిందనే చెప్పాలి.  మొత్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.  ఒక రకంగా బాహుబలితో వచ్చిన ఇమేజ్‌‘రాధే శ్యామ్’ మూవీకి ప్రభాస్‌కు పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి.

  First published:

  Tags: Prabhas, Radhe Shyam, Tollywood, Tollywood Box Office Report

  ఉత్తమ కథలు