హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam 2nd Day WW Collections : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 2 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెబల్ స్టార్ ఇమేజ్‌ను ప్రశ్నించేలా వసూళ్లు..

Radhe Shyam 2nd Day WW Collections : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ 2 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెబల్ స్టార్ ఇమేజ్‌ను ప్రశ్నించేలా వసూళ్లు..

Radhe Shyam 2nd Day WW collections: ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హిందీలోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఇక రెండు రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ విషయానికొస్తే..

ఇంకా చదవండి ...

    Radhe Shyam 2nd Day WW Collections : ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు మొదటి రోజు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హిందీలోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు అక్కడ కేవలం రూ. 2.4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. రెండో రోజు మాత్రం రూ. 2.05 కోట్లు మాత్రమే వసూళు చేసింది. ఒక రకంగా ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌కు ఇదే పెద్ద దెబ్బ అనే చెప్పాలి.   మరోవైపు మిగిలిన రాష్ట్రాలలో సైతం ఈ సినిమాకు ఊహించిన కలెక్షన్స్ అయితే రాలేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రికార్డు కూడా క్రియేట్ చేయలేకపోయింది రాధే శ్యామ్.

    ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూడటానికి ప్రేక్షకులు అస్సలు ఇష్టపడలేదని ఈ సినిమా వసూళ్లతో అర్థమవుతుంది. ఒక్కసారి ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి.. రెండో రోజు తెలంగాణ, ఆంధ్ర  ప్రదేశ్‌లో రూ. 12.32 కోట్లు షేర్ మాత్రమే వసూళు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.81 కోట్లు మాత్రమే వసూళు చేసింది. హిందీ, ఓవర్సీస్ సహా మిగిలిన అన్ని ఏరియాల్లో కలిపి రెండో రోజు మొత్తంగా రూ. 18.02 కోట్లు మాత్రమే వసూళ్లును దక్కించుకుంది. అంటే తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే.. రూ. 5.7 కోట్లు మాత్రమే వసూళ్లను సాధించింది. మొత్తంగా రెండో రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే..

    Roja - Vijayashanti - Sai Pallavi: ఆ తరంలో విజయశాంతి.. ఆ తర్వాత రోజా.. ఈ జనరేషన్‌లో సాయి పల్లవి..

    నైజాం (తెలంగాణ): రూ. 17.41 కోట్లు / రూ. 36.50 కోట్లు

    సీడెడ్ (రాయలసీమ): రూ. 5.04 కోట్లు / రూ . 18 కోట్లు

    ఉత్తరాంధ్ర: రూ. 3.19 కోట్లు  / రూ. 13 కోట్లు

    ఈస్ట్: రూ. 3.21 కోట్లు / రూ. 8.80 కోట్లు

    వెస్ట్: రూ. 2.47 కోట్లు / రూ. 7.50 కోట్లు

    గుంటూరు: రూ. 3.32 కోట్లు / రూ. 9.90 కోట్లు

    కృష్ణా: రూ. 1.66 కోట్లు / రూ. 7.50 కోట్లు

    నెల్లూరు: రూ. 1.51 కోట్లు / రూ. 4 కోట్లు

    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 37.81 కోట్లు / రూ.  105.20 కోట్లు

    కర్ణాటక: రూ. 3.40 కోట్లు / రూ. 12.50 కోట్లు

    తమిళనాడు: రూ. 0.48 కోట్లు /  రూ. 6 కోట్లు

    కేరళ: 0.10 కోట్లు / రూ. 2.10 కోట్లు

    హిందీ: రూ. 4.45 కోట్లు / రూ. 50 కోట్లు

    రెస్టాఫ్ ఇండియా: రూ. 1 కోట్లు /  రూ. 3 కోట్లు

    ఓవర్సీస్ : రూ. 9.15 కోట్లు / రూ. 24 కోట్లు

    ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 56.39 కోట్లు (97.70) / రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

    Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సహా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

    మొదటి రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే.. ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీ నష్టాలు తప్పేలా కనపడటం లేదు. ఈ రోజు ఆదివారం కలెక్షన్స్‌లో పెరుగుదల ఉండొచ్చు. ఒకవేళ ఇదే ఫ్లో కంటిన్యూ అయితే.. ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్‌లో ఈ సినిమా నిలవవచ్చు. పెట్టిన పెట్టుబడికి పావు వంతు మాత్రమే రికవరీ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీలో ఇంకా రూ. 45 కోట్ల టార్గెట్‌ను రీచ్ కావాలి.‘సాహో’ విషయానికొస్తే.. ఈ సినిమాకు తెలుగులో కంటే హిందీ బెల్ట్‌లో ఓ ఊపు ఊపింది. అలాంటి రాధే శ్యామ్ విషయానికొచ్చే వరకు అంతా తలకిందులైంది.   మొత్తంగా ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ పరుగు సోమవారం అయితే కానీ క్లారిటీ రాదు. ఒక రకంగా బాహుబలితో వచ్చిన ఇమేజ్‌‘రాధే శ్యామ్’ మూవీకి ప్రభాస్‌కు పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. మొత్తంగా ఈ రోజు, రేపటితో ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ ఫలితం ఏమిటనేది తేలిపోనుంది.

    First published:

    Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood, Tollywood Box Office Report

    ఉత్తమ కథలు