Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Saaho: అభిమానులకు ప్రభాస్ ప్రామిస్.. ఇక నుంచి అలా చేయడట..

    ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సాహో’. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు రెండేళ్లు పూర్తి సమయాన్ని కేటాయించాడు. దీంతో అభిమానులకు ప్రభాస్ ఓ వాగ్దానం చేసాడు.

    news18-telugu
    Updated: August 11, 2019, 8:29 AM IST
    Saaho: అభిమానులకు ప్రభాస్ ప్రామిస్.. ఇక నుంచి అలా చేయడట..
    ‘సాహో’లో ప్రభాస్ (ఫైల్ ఫోటో)
    • Share this:
    ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సాహో’. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు రెండేళ్లు పూర్తి సమయాన్ని కేటాయించాడు. అంతకు ముందు ‘బాహుబలి’ సిరీస్‌ కోసం నాలుగేళ్ల సమయం దానికే వెచ్చించాడు. అందుకే ఇక ముందు చేయబోయే సినిమాలను ఆరు నెలల్లోనే కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు ఇక నుండి ప్రతి యేడాది తను యాక్ట్ చేసిన రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటానని ‘సాహో’ హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వెల్లడించాడు. అంతేకాదు ‘సాహో’ సినిమా కోసం ప్రభాస్ తొలిసారి హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. దీని కోసం కొంచెం కష్టపడ్డానని చెప్పుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘సాహో’ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది. మరోవైపు బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. మరోవైపు ప్రభాస్.. తన నెక్ట్స్ మూవీని రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నానని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 20 రోజులు కేటాయించానని చెప్పుకొచ్చాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘సాహో’ మూవీని సుజిత్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ,తమిళం, మలయాళంలో విడుదల కానుంది.
    Published by: Kiran Kumar Thanjavur
    First published: August 11, 2019, 8:29 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading