హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas | Project K : ప్రభాస్ ప్రాజెక్ట్ కె నుంచి జబర్దస్త్ అప్ డేట్.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్..

Prabhas | Project K : ప్రభాస్ ప్రాజెక్ట్ కె నుంచి జబర్దస్త్ అప్ డేట్.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్..

Prabhas Photo : Twitter

Prabhas Photo : Twitter

Prabhas | Project K : ప్రభాస్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె అనే సినమాను చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా జబర్దస్త్ అప్ డేట్ వచ్చింది. ప్రాజెక్ట్ కె రెగ్యులర్ షూట్ నవంబర్ నుంచి మొదలు కానుందని సమాచారం.

ఇంకా చదవండి ...

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఆ మధ్య గురుపూర్ణిమా సందర్భంగా ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కొత్త అప్ డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే నవంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్’లో సినిమా మెయిన్ క్యాస్ట్ అంతా కూడా పాల్గొననున్నారట. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే రితీగా డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ఇక ఈ సినిమా గురించి మరో విషయం ఏమంటే.. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేస్తున్నారట.

ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ (Radhe Shyam) పేరుతో వస్తోన్న ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

Anushka Shetty : చంద్రముఖి సీక్వెల్‌లో అనుష్క శెట్టి.. నవీన్‌ పొలిశెట్టి సినిమా ఆగినట్లేనా.. 

ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను చేస్తున్నాడు. వాటిలో కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్‌లో అనౌన్స్ చేసిన సలార్‌పై భారీ అంచనాలున్నాయి. సెన్సేషనల్ కాంబో ప్రశాంత్ నీల్ తో ప్రకటన రావడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

NTR | Mahesh Babu : ఎన్టీఆర్‌ అడ్డాలో మహేష్ బాబు.. ఇక వారిని అందుకోవడం కష్టమే..

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోందని సమాచారం. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా..

ఇక ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక రావణాసురుడి పాత్రను పోషిస్తారని మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ మొదలైన ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఆగస్టు 11 2022 న విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

First published:

Tags: Deepika Padukone, Nag Ashwin, Prabhas, Project K, Tollywood news

ఉత్తమ కథలు