హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Project K : ప్రాజెక్ట్ K షూటింగ్‌లో మళ్లీ ప్రారంభం.. ప్రభాస్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ..

Prabhas - Project K : ప్రాజెక్ట్ K షూటింగ్‌లో మళ్లీ ప్రారంభం.. ప్రభాస్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ..

ప్రభాస్ (File/Photo)

ప్రభాస్ (File/Photo)

Prabhas - Project K : ప్రభాస్ తిరిగి ప్రాజెక్ట్ K షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇంకా చదవండి ...

Prabhas - Project K : ప్రభాస్ ఈ యేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘రాధే శ్యామ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. వీక్ కథతో ప్రభాస్ చేసిన ఈ చిత్రం ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సలార్’ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఇక రాధే శ్యామ్ రిలీజ్ తర్వాత ప్రభాస్‌కు మైనర్ ఆపరేషన్ జరగడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. తాజాగా ప్రభాస్ తిరిగి ప్రాజెక్ట్ K షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో  తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ K’(Project K) . ఈ సినిమాను నాగ్ అశ్విన్ ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ముందుగా  రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ట్రయల్ షూట్ కూడా నిర్వహించారు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా రాధే శ్యామ్ తర్వాత  ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.   అంతేకాదు ఈ చిత్రాన్ని 2023 సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అది బాహుబలి 2 విడుదల తేది అయిన ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.

Tollywood Top Disaster Movies : టాలీవుడ్ టాప్ డిజాస్టర్ మూవీస్.. ఆచార్య, రాధే శ్యామ్ ప్లేస్‌ ఎక్కడంటే..


ఇక ఈ సినిమా షూటింగ్ సందర్భంగా  ప్రభాస్.. అమితాబ్ బచ్చన్‌గారితో మొదటిసారి నటించడంతో తన చిరకాల కోరిక నెరవేరిందన్నారు. ఈ సినిమా కోసం కామన్ ఆడియన్స్ తో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రభాస్.. అమితాబ్ బచ్చన్ నటించిన ‘డాన్’ చిత్రాన్ని చాలా యేళ్ల తర్వాత ‘బిల్లా’ పేరుతో రీమేక్ చేసారు. బిగ్‌ బీకి దక్కిన సక్సెస్ .. రెబల్ స్టార్‌కు దక్కలేదు. ఈ సినిమాను ముందుగా నటరత్న అన్నగారైన ఎన్టీఆర్ ‘యుగంధర్’ కూడా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రం ఆ తర్వాత ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. షారుఖ్ ఖాన్... బిగ్ బీ మూవీ డాన్‌ను అదే పేరుతో రీమేక్ చేశారు. తరువాత సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు. అలాగే ‘డాన్’కి రీమేక్ గానే తమిళంలో రజినీకాంత్ ‘బిల్లా’ చేశారు. ఆ సినిమానే అజిత్ సరికొత్తగా అదే టైటిల్‌ ‘బిల్లా’పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. చివరగా తెలుగులో ప్రభాస్ కూడా ‘బిల్లా’గా మారాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.

RRR Vs Bahubali 2 : ఓవర్సీస్‌లో బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ మరో అరుదైన రికార్డు..


ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే బల్క్ డేట్స్ కేటాయించారు. ఈ  సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ఇక ఈ సినిమా గురించి మరో విషయం ఏమంటే.. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.

First published:

Tags: Nag Ashwin, Prabhas, Project K, Tollywood

ఉత్తమ కథలు