Deepika Padukone - PV Sindhu : బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకొణే.. రెండు సార్లు ఒలింపిక్స్ విజేత పీవీ సింధుతో కలిసి చిల్ అయింది. అంతేకాదు ఆమెతో కలిసి బాట్మింటన్ ఆట ఆడి సేద తీరింది. వివరాల్లోకి వెళితే.. దీపికా పదుకొణే విషయానికొస్తే.. షారుఖ్ ఖాన్ హీరోగా ఫరా ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుసగా అగ్ర హీరోల సరసన నటించడంతో పాటు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక మూడేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను వివాహం చేసుకున్న దీపికా.. పెళ్లైన తరువాత సినిమాలను కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం దీపికా షారూక్ సరసన పఠాన్‌లో, శంకాను భత్రా దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తోంది.
వీటితో పాటు ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీలో దీపికా పదుకొణే సింగ్ కథానాయికగా నటిస్తోంది. వీటితో పాటు హృతిక్ రోషన్, సిద్ధార్ధ్ మల్హోత్ర కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అలాగే పెళ్లైన తరువాత రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించిన 83 సినిమా ఏడాది కాలంగా మంచి రిలీజ్ డేట్ కోసం వేచి చేస్తోంది.
బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..
ఇక రణ్వీర్ సింగ్‌తో తొలిసారి ‘రామ్‌లీలా’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘బాజీరావు మస్తానీ’ సినిమాలో నటించింది. ఆపై సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’లో టైటిల్ రోల్ ప్లే చేసింది. దీపికా పదుకొణే చివరగా ‘ఛపాక్’ సినిమాలో కనిపించింది. అంతేకాదు తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి ‘సర్కస్’ సినిమాలో నటిస్తోంది. ఇక ప్రభాస్‌తో చేస్తోన్న ప్రాజెక్ట్ K సినిమా నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆ సంగతి పక్కన పెడితే.. దీపికా పదుకొణే తండ్రి ప్రకాష్ పదుకొనే స్వతహాగా బాట్మింటన్ క్రీడాకారుడు. అంతేకాదు దేశం తరుపున బాట్మింటన్ ఆడి పలు పతాకాలు కూడా గెలిచారు. ఆ ఆధ్వర్యంలో కూతురు దీపికా పదుకొణే బాట్మింటన్ నేర్చుకుంది. సినిమాల్లో అవకాశాలు రావడంతో బాట్మింటన్ను పక్కన పెట్టింది. అయినా.. అవకాశం దొరికినపుడల్ల బాట్మింటన్ ఆడుతూనే ఉంది.
View this post on Instagram
తాజాగా ఒలింపిక్ విజేత పీవీ సింధుతో కలిసి దీపికా పదుకొణే బాట్మింటన్ ఆడింది. దానికి సంబంధించిన వీడియోతో పాటు ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాదు పీవీ సింధుతో కలిసి ఓ రేంజ్లో ఇరగదీసింది దీపికా పదుకొణే. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Deepika Padukone, Project K, Pv sindhu, Tollywood