Prabhas - Prithviraj Sukumaran : ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్..

ప్రభాస్,పృథ్వీరాజ్ సుకుమారన్ (Twitter/Photo)

Prabhas - Salaar - Prithviraj Sukumaran : రెబల్ స్టార్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

  • Share this:
    Prabhas - Salaar - Prithviraj Sukumaran : రెబల్ స్టార్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్‌గా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక పృథ్వీ రాజ్ నటిస్తే.. ఈ సినిమాకు మలయాళ మార్కెట్‌లో వచ్చే ఇంపాక్ట్ వేరే లెవల్లో ఉంటుంది. ఇక ప్రభాస్ ‘సలార్’లో విలన్‌ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఒకవేళ యాక్ట్ చేస్తే మలయాళంలో ఈ సినిమా రేంజ్ మారిపోవడం ఖాయం అంటున్నారు. అందుకే భారీ పారితోషకంతో పాటు కథ కూడా నచ్చడంతో పృథ్వీరాజ్ కూడా ‘సలార్’ మూవీలో విలన్‌గా యాక్ట్  చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

    రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికొస్తే..  వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమాను పూర్తి చేసారు. ఈ  చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి బిగ్‌ అప్టేట్ రానుంది. దాంతో పాటు మిగతా సినిమా గురించి ఏదైనా అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

    ‘ఆహా’ ఓటీటీ కోసం బాలకృష్ణ వర్కింగ్ స్టిల్స్.. సోషల్ మీడియాలో వైరల్..

    ఇక ప్రభాస్..  ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానీకొచ్చింది.  దాంతో పాటు నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్ట్ K సినిమా ఉండనే ఉంది. మరోవైపు తన 25వ చిత్రాన్నిసందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయనున్నట్టు ప్రకటించారు.  అటు బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్‌తో పాటు మహిళ దర్శకురాలు సుధ కొంగరతో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    NTR-NBK: తండ్రి ఎన్టీఆర్ ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్‌తో బాలకృష్ణ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..

    ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ పైనే ఉంది.  ఈ సినిమా షూటింగ్‌ సింగరేణిలో చేయనున్నారు. ఈ షెడ్యూల్లో శృతి హాసన్, ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేయనున్నట్టు సమాచారం.కథతో పాటు సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ షూట్ చేసిన ప్రాంతాల్లో ‘సలార్’ సినిమాను పిక్చరైజ్ చేస్తున్నాడట. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్టు సమాచారం. దానికి ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    ఈ  సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో శృతి హాసన్ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

    ’సలార్’లో ప్రభాస్ సరసన మీనాక్షి చౌదరి (File/Photo)


    అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నారు. ఇంతకు ముందు ఈ సినిమాలో  బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా పృథ్వీరాజ్ ను ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా ఫైనల్ చేసారట. ఆల్రెడీ ఈ సినిమాలో కన్నడ నటుడు కూడా నటిస్తున్నారు‘సలార్’ సినిమాను 2022 డిసెంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా విడుదలకు యేడాదికి ముందే ఈ సినిమాకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ భారీ రేటు పలుకుతున్నయట.

    ప్రభాస్,పృథ్వీరాజ్ సుకుమారన్ (Twitter/Photo)


    ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ .. ‘సలార్’ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ ను రూ. 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేసారట.బాలీవుడ్ బడా హీరోల సినిమాలకు కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ రేటు ప్రకటించలేదు. కానీ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై అన్ని భాషల్లో క్రేజ్ ఉంది. అందుకే ఇంత మొత్తంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆఫర్ చేసినట్టు సమాచారం.

    NBK - NTR : ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ను వెంటాడుతున్న బాబాయి బాలయ్య బ్యాడ్ సెంటిమెంట్..

    కానీ చిత్ర నిర్మాతలు మాత్రం ఈ ఆఫర్ గురించి ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ‘జనతా గ్యారేజ్’లో పక్కా లోకల్ అంటూ ఐటెం పాటతో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ‘సలార్’ అంటే ధైర్యవంతుడనే అర్ధం ఉంది. రాజుకు కుడి భుజంగా వ్యవహరించి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి.  అంతేకాదు బలమైన నాయకుడు అనే అర్ధం కూడా ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: