Prabhas - Salaar: ప్రభాస్ ‘సలార్’ మూవీకి భారీ క్రేజ్.. విడుదలకు యేడాది ముందే భారీ డీల్.. ?

ప్రభాస్ ‘సలార్’ మూవీ (Instagram/Photo)

Salaar - Prabhas - Prashanth Neel: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. తాజాగా ఈ సినిమాకు విడుదలకు యేడాది ముందే భారీ డీల్‌ కుదిరినట్టు సమాచారం.

  • Share this:
    Salaar - Prabhas - Prashanth Neel: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. ప్రశాంత్ నీల్-ప్రభాస్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ కాంబినేషన్‌పై చర్చ జరుగుతుంది. ఎలాంటి సినిమా ఈ కాంబోలో రాబోతుందో అని చర్చించుకుంటున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సింగరేణి షెడ్యూల్ కంప్లీట్ అయింది.  ఈ సినిమా విడుదలకు యేడాదికి ముందే ఈ సినిమాకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ భారీ రేటు పలుకుతున్నయట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ .. ‘సలార్’ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ ను రూ. 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేసారట.

    బాలీవుడ్ బడా హీరోల సినిమాలకు కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ రేటు ప్రకటించలేదు. కానీ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై అన్ని భాషల్లో క్రేజ్ ఉంది. అందుకే ఇంత మొత్తంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ చిత్ర నిర్మాతలు మాత్రం ఈ ఆఫర్ గురించి ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదట.

    KGF Fame Prashanth Neel Announced Another Crazy project With sriimurali Bagheera, Prashanth Neel : ’సలార్’తో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన ప్రశాంత్ నీల్..,Prabhas,Prashanth Neel,Prashanth Neel Bagheera,Prashanth Neel With New Project Sriimurali Bagheera,Prabhas Salaar Movie,Prabhas Prashanth Neel,Prabhas Prashanth Neel SALAAR movie,SALAAR movie, SALAAR,prabhas news, Prabhas to sign film with KGF director Prashanth Neel,sunny singh, Adipurush Update release date confirmed,Prabhas looks lord rama, nag ashwin,prabhas,prabhas nag ashwin movie,nag ashwin about prabhas next movie heroine is deepika padukone,prabhas new movie,nag ashwin about prabhas next movie heroine,prabhas upcoming film,prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas movie,prabhas next movie,prabhas movies,nag ashwin about prabhas movie name heroine and story,deepika padukone,nag ashwin vijay devarakonda,ప్రభాస్, దీపికా పదుకొనే, prashanth neel,ప్రశాంత్ నీల్,ప్రభాస్ అసదుద్దీన్ ఓవైసీ,ప్రభాస్,ప్రభాస్ ప్రశాంత్ నీల్,ప్రశాంత్ నీల్ బఘీరా,ప్రశాంత్ నీల్ శ్రీ మురళి బఘీరా
    ప్రభాస్,ప్రశాంత్ నీల్ (Twitter/Photo)


    ‘సలార్’ పూర్తి కాగానే హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది‌. ఈ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా ఏప్రిల్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ తన ప్రతి చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాకు కూడా అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా ‘సలార్’ అనే ఉర్దూ పదాన్ని టైటిల్‌గా పెట్టారు. ‘సలార్’ అంటే ధైర్యవంతుడనే అర్ధం ఉంది. రాజకు కుడి భుజంగా వ్యవహరించి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి.  అంతేకాదు బలమైన నాయకుడు అనే అర్ధం కూడా ఉంది. ఇక ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్’ మూవీ  జూలై 30న విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: