ఈ మధ్యకాలంలో సినిమా షూటింగ్స్ నుంచి లీక్స్ వస్తుండటం ఎక్కువగా చూస్తున్నాం. లొకేషన్ స్టిల్స్, హీరోహీరోయిన్ల లుక్స్ ఇలా ఎన్నో రకాల లీక్స్ మేకర్స్‌కి తలనొప్పిగా మారుతున్నాయి. ఇదే బాటలో ఇప్పుడు ప్రభాస్ (Prabhas) భారీ సినిమా సలార్ (Salaar) నుంచి ఓ ఆడియో క్లిప్ లీక్ అయిందంటూ.. సదరు క్లిప్‌ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓ వాయిస్ రికార్డు వైరల్ అవుతోంది. ఇది సలార్ సినిమాలోని డైలాగ్ అంటూ నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది నిజంగానే సినిమాలో ఉందా లేక ఎవరైనా కావాలని క్రియేట్ చేశారా? అని సందేహాలు మాత్రం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.
వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ఈ సలార్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సలార్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ చూడబోతున్నామని ఇప్పటికే ఫిక్స్ అయిన ఆడియన్స్.. ఎప్పటికప్పుడు వస్తున్న అప్‌డేట్స్‌తో మరింత హుషారెత్తిపోతున్నారు. మునుపెన్నడూ చూడని రీతిలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి భారీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాతో ఆ సీన్ మళ్ళీ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
#Salaar Dialogue 3 by me #Prabhas pic.twitter.com/lGHj73HeYH
— SALAAR REBEL 25 (@KGF_SALAAR) January 25, 2023
తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా యాక్షన్ సీన్స్ షూట్ చేశారట ప్రశాంత్ నీల్. వరుస సినిమాలు లైన్ లో ఉన్నప్పటికీ సలార్ కోసం ప్రభాస్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబో చిరకాలం గుర్తుండేలా ఈ చిత్రంలోని సీన్స్ ఉండనున్నాయట. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున ఈ సలార్ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ (Prithwiraj sukumaran), ఈశ్వరీరావు (Eeswari Rao) కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి బస్రూర్ (Ravi Basrur) బాణీలు కడుతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Prabhas, Prashanth Neel, Salaar movie