Prabhas - Salaar: ప్రభాస్ ‘సలార్‌’ మూవీ కోసం విలన్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్ హీరో..

ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా బాలీవుడ్ హీరో (Twitter/Photo)

Salaar - Prabhas - Prashanth Neel:  భాహుబలి పుణ్యామా రెబల్ స్టార్  ప్రభాస్.. నేషనల్ స్టార్ అయిపోయారు. ఈయన చిత్రాలన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి.  తాజాగా ‘సలార్’ సినిమాలో ప్రభాస్ ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ అగ్ర హీరో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  • Share this:
    Salaar - Prabhas - Prashanth Neel:  భాహుబలి పుణ్యామా రెబల్ స్టార్  ప్రభాస్.. నేషనల్ స్టార్ అయిపోయారు. ఈయన చిత్రాలన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి.  ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ .. రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ కంప్లీట్ చేసారు. ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అప్పటికీ కరోనా పరిస్థితులు అనుకూలిస్తే.. ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే.. పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ఇక  ఈ సినిమా మొదటి షెడ్యూల్ సింగరేణిలో పూర్తి చేసారు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ జరుగుతోంది.  ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌‌ను ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ షెడ్యూల్లో శృతి హాసన్, ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేయనున్నట్టు సమాచారం.

    ఐతే.. ఈ షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సినిమాను పిక్చరైజ్ చేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ లో చిత్రీకరించనున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతానికి వాయిదా వేసారు.  కథతో పాటు సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ షూట్ చేసిన ప్రాంతాల్లో ‘సలార్’ సినిమాను పిక్చరైజ్ చేస్తున్నాడట. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్టు సమాచారం. దానికి ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ  సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. .

    ప్రభాస్.. గతంలో ‘బిల్లా’, ‘బాహుబలి’ సిరీస్‌లో రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక పాత్ర కథ ప్రకారం చనిపోతుంది.  ఇపుడు ‘సలార్’లో చేసే రెండు పాత్రల్లో ఒక పాత్ర చనిపోయే క్యారెక్టరా కాదా అనేది చూడాలి.

    KGF Fame Prashanth Neel Announced Another Crazy project With sriimurali Bagheera, Prashanth Neel : ’సలార్’తో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన ప్రశాంత్ నీల్..,Prabhas,Prashanth Neel,Prashanth Neel Bagheera,Prashanth Neel With New Project Sriimurali Bagheera,Prabhas Salaar Movie,Prabhas Prashanth Neel,Prabhas Prashanth Neel SALAAR movie,SALAAR movie, SALAAR,prabhas news, Prabhas to sign film with KGF director Prashanth Neel,sunny singh, Adipurush Update release date confirmed,Prabhas looks lord rama, nag ashwin,prabhas,prabhas nag ashwin movie,nag ashwin about prabhas next movie heroine is deepika padukone,prabhas new movie,nag ashwin about prabhas next movie heroine,prabhas upcoming film,prabhas movie,prabhas nag ashwin movie story,nag ashwin prabhas movie,prabhas next movie,prabhas movies,nag ashwin about prabhas movie name heroine and story,deepika padukone,nag ashwin vijay devarakonda,ప్రభాస్, దీపికా పదుకొనే, prashanth neel,ప్రశాంత్ నీల్,ప్రభాస్ అసదుద్దీన్ ఓవైసీ,ప్రభాస్,ప్రభాస్ ప్రశాంత్ నీల్,ప్రశాంత్ నీల్ బఘీరా,ప్రశాంత్ నీల్ శ్రీ మురళి బఘీరా
    ప్రభాస్,ప్రశాంత్ నీల్ (Twitter/Photo)


    తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ ఢీ కొట్టే విలన్ పాత్రలో జాన్ అబ్రహం నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విసయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. జాన్ అబ్రహం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ సినిమాలో కన్నడ నటుడు కూడా నటిస్తున్నారు‘సలార్’ సినిమా విషయానికొస్తే..  వచ్చే యేడాది ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.  ఈ సినిమా విడుదలకు యేడాదికి ముందే ఈ సినిమాకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ భారీ రేటు పలుకుతున్నయట.

    ఫ్రభాస్, జాన్ అబ్రహం (File/Photos)


    ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ .. ‘సలార్’ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ ను రూ. 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేసారట.బాలీవుడ్ బడా హీరోల సినిమాలకు కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ రేటు ప్రకటించలేదు. కానీ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై అన్ని భాషల్లో క్రేజ్ ఉంది. అందుకే ఇంత మొత్తంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ చిత్ర నిర్మాతలు మాత్రం ఈ ఆఫర్ గురించి ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదట.

    Kriti Sanon, Prabhas, Prabhas Adipurush, Prabhas Adipurush movie, ప్రభాస్ , ప్రభాస్ ఆదిపురుష్, ఆదిపురుష్ మూవీ
    ప్రభాస్ ఆదిపురుష్‌లో లక్ష్మణుడిగా సన్ని సింగ్, సీతగా కృతి సనన్ (Twitter/Photo)


    ‘సలార్’ పూర్తి కాగానే హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది‌. ఈ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ  ఖాన్ లంకేషుడైన రావణాసురుడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు ఆది నుంచి అవాంతరాలు ఏర్పడడంతో ఈ సినిమా కోసం ప్రభాస్ కుటుంబ సభ్యుల సలహాతో  శాంతి హోమం చేయిస్తున్నారట. మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా అక్టోబర్  నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ తన ప్రతి చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాకు కూడా అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా ‘సలార్’ అనే ఉర్దూ పదాన్ని టైటిల్‌గా పెట్టారు. ‘సలార్’ అంటే ధైర్యవంతుడనే అర్ధం ఉంది. రాజుకు కుడి భుజంగా వ్యవహరించి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి.  అంతేకాదు బలమైన నాయకుడు అనే అర్ధం కూడా ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: