• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PRABHAS PRASHANTH NEEL SALAAR GET HUGE OFFER FROM AMAZON PRIME HERE ARE THE DETAILS SR

Prabhas Salaar : సలార్‌ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్..

సలార్‌లో ప్రభాస్ Photo : Twitter

Prabhas Salaar : రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం సలార్.

  • Share this:
    రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా 'ఉగ్రమ్' కన్నడ చిత్రానికి రీమేక్​ అంటున్నారు. దీనిపై కొంత క్లారిటీ రావాలసిఉంది. ఇక ఈ సినిమాను కేజీయఫ్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొంత సోషల్ కాన్సెప్ట్‌తో సామాన్యుల హక్కుల పోరాడే ఒక పవర్ ఫుల్ అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం విపరీతంగా అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ‌తో ఓ ఖతర్నాక్ దర్శకుడు తోడవ్వడం సినిమా మరింత క్రేజ్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా కేజీయఫ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు. ఆ సినిమాలో సెంటిమెంట్స్ కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్‌లు గానీ.. ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా అంటే ఓ రేంజ్‌లో ఊహించుకుంటున్నారు.

    ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తం ఆఫర్ చేసారని టాక్ నడుస్తోంది. సలార్‌కు సంబంధించి అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులకు గాను 100 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ పోస్ట్ థియేట్రికల్ రన్ తర్వాత అని అంటున్నారు. ఈ వార్తలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

    ఇక ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ అనే సినిమా చేస్తున్నారు. హీరోయిన్‌గా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేశ్‌గా న‌టిస్తున్నారు. ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రలో యువ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది. ఈ సినిమాను భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    ప్రభాస్ ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం రాధే శ్యామ్‌ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే కాక బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: