PRABHAS PRASHANTH NEEL CRAZY PAN INDIA MOVIE SALAAR MOVIE VAANI KAPOOR WILL ROMANCE WITH PRABHAS HERE ARE THE DETAILS TA
Prabhas - Salaar: ’సలార్’లో రెబల్ స్టార్ ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ క్రేజీ భామ..
‘సలార్’గా ప్రభాస్ (Instagram/Photo)
Prabhas - Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమాను పూర్తి చేసారు. తాజాగా ‘సలార్’లో ప్రభాస్‌కు జోడిగా మరో బాలీవుడ్ క్రేజీ భామ నటించబోతున్నట్టు సమాచారం.
Prabhas - Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమాను పూర్తి చేసారు. ఈ సినిమా తర్వాత ఒకేసారి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు నాగ్ అశ్విన్ సినిమా ఉండనే ఉంది. అటు బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్‌తో పాటు మహిళ దర్శకురాలు సుధ కొంగరతో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ మూవీ పైనే ఉంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ సింగరేణిలో పూర్తి చేసారు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శృతి హాసన్, ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేయనున్నట్టు సమాచారం.
ఐతే.. ఈ షెడ్యూల్‌ను ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సినిమాను పిక్చరైజ్ చేసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో చిత్రీకరించనున్నారు. కథతో పాటు సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ షూట్ చేసిన ప్రాంతాల్లో ‘సలార్’ సినిమాను పిక్చరైజ్ చేస్తున్నాడట. అందుకు తగ్గట్టు స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్టు సమాచారం. దానికి ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ సినిమాలో ప్రభాస్.. డాన్ క్యారెక్టర్‌తో పాటు ఆర్మీ ఆఫీసర్‌గా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో శృతి హాసన్ ఓ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణీ కపూర్ కూడా నటించబోతున్నట్టు సమాచారం.
‘సలార్’లో ప్రభాస్‌కు జోడిగా వాణీ కపూర్ (File/Photo)
అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విసయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. జాన్ అబ్రహం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ సినిమాలో కన్నడ నటుడు కూడా నటిస్తున్నారు‘సలార్’ సినిమా విషయానికొస్తే.. వచ్చే యేడాది ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు యేడాదికి ముందే ఈ సినిమాకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ భారీ రేటు పలుకుతున్నయట.
ఫ్రభాస్, జాన్ అబ్రహం (File/Photos)
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ .. ‘సలార్’ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను రూ. 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేసారట.బాలీవుడ్ బడా హీరోల సినిమాలకు కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ రేటు ప్రకటించలేదు. కానీ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై అన్ని భాషల్లో క్రేజ్ ఉంది. అందుకే ఇంత మొత్తంలో అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ చిత్ర నిర్మాతలు మాత్రం ఈ ఆఫర్ గురించి ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ ఐటెం సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ‘జనతా గ్యారేజ్’లో పక్కా లోకల్ అంటూ ఐటెం పాటతో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా.
ప్రభాస్ ‘సలార్’ మూవీతో పాటు సమాంతరంగా హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేషుడైన రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ తన ప్రతి చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తుండంతో ఈ సినిమాకు కూడా అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండేలా ‘సలార్’ అనే ఉర్దూ పదాన్ని టైటిల్‌గా పెట్టారు. ‘సలార్’ అంటే ధైర్యవంతుడనే అర్ధం ఉంది. రాజుకు కుడి భుజంగా వ్యవహరించి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. అంతేకాదు బలమైన నాయకుడు అనే అర్ధం కూడా ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.