ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’ (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. అది అలా ఉంటే ఈ ట్రైలర్‌ను చూసిన ప్రభాస్ తాజాగా మహా సముద్రం టీమ్‌ను మెచ్చుకున్నారు. చిత్ర ట్రైలర్ బాగుందని... చాలా ఇంటెన్స్‌గా ఉందని.. తన సోషల్ మీడియాలో పేర్కోన్నారు. ఇక ఆయన నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఆ మధ్య గురుపూర్ణిమా సందర్భంగా ప్రాజెక్ట్ K (Project K) అనే భారీ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ వచ్చే నవంబర్ నెల నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్‌లు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆయన రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో రాధేశ్యామ్ విడుదలకు రెడీ అవుతుండగా.. సలార్, ఆదిపురుష్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇక మహా సముద్రం విషయానికి వస్తే.. ఈ సినిమాలో అదితీ రావు హైదరీ, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. సంగీతం చేతన్ భరద్వాజ్‌అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇప్పటికే మహా సముద్రం ట్రైలర్ నాలుగు మిలియన్ పైగా వ్యూస్‌తో ట్రెండింగ్ అవుతోంది.
Team #MahaSamudram Thanks the PAN INDIA STAR #Prabhas for his lovely encouraging words on Trailer - https://t.co/7bWxC7zRE0@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial #MahasamudramOnOct14th ? pic.twitter.com/zauhCbpVNb
— BA Raju's Team (@baraju_SuperHit) September 25, 2021
ట్రైలర్‌లో ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. సముద్రం చాలా గొప్పది మామ. తనలో చాలా రహస్యలు దాచుకుంటుంది. నవ్వుతూ కనిపించనంత మాత్రానా బాగున్నట్టు కాదు అర్జున్ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులు, మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అంటూ సిద్ధార్థ్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ భూపతి.
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన (Maha Samudram release for dussehra) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. అందులో భాగంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రదర్శక నిర్మాతలు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్‌ల సరసన అదితీ రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ (Aditi Rao Hydari), (Anu Emmanuel)నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ చేయడం లేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ క్రేజీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
మహా సముద్రం సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న విడుదల కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల్లో విడుదల వాయిదా పడింది. కాగా ఈ మధ్య కరోనా కేసులు తగ్గడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు సినిమాలు విడుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మహా సముద్రం దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఇప్పటికే దసరా బరిలో బాలయ్య అఖండ బరిలో ఉందని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, నాగ శౌర్య వరుడు కావలెను సినిమాలు కూడా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maha Samudram, Prabhas, Sharwanand, Tollywood news