హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam Trailer : "విధిని ఎదురించి ప్రేమ గెలవగలదా " తెలుగు తెరపై టైటానిక్.. సూపర్ గా రాధేశ్యామ్ ట్రైలర్..

Radhe Shyam Trailer : "విధిని ఎదురించి ప్రేమ గెలవగలదా " తెలుగు తెరపై టైటానిక్.. సూపర్ గా రాధేశ్యామ్ ట్రైలర్..

వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాతలు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాతలు. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Radhe Shyam Trailer : పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

  బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.. రాధే శ్యామ్ ట్రైలర్ రొమాంటిక్ గా మొదలై ఎమోషనల్ గా ముగుస్తుంది. విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ కథ ఎలా ముగిసింది.. ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది ఈ చిత్ర కథగా అర్థం అవుతోంది. ట్రైలర్ ప్రభాస్ డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. "రేయ్ అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవని" అంటూ ప్రభాస్ ఆసక్తికరమైన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ ట్రాక్ మొదలవుతుంది. అద్భుతమైన లొకేషన్స్ లో అన్ని సన్నివేశాలని దర్శకుడు రాధా కృష్ణ కలర్ ఫుల్ గా తెరకెక్కించాడు. విజువల్ వండర్ అనిపించే షిప్, సముద్రపు సన్నివేశాలు కూడా ఉన్నాయి.

  అసలు ఎవరీ గుడ్ లుకింగ్ బ్యాడ్ ఫెలో అని పూజా హెగ్డే చెప్పగానే కృష్ణం రాజు స్వామిజీ గా ఎంట్రీ ఇస్తాడు. ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర గురించి కృష్ణం రాజు చెప్పే డైలాగులు అంచనాలు పెంచేస్తున్నాయి. 'ది డ్రెస్ విక్రమాదిత్య.. పామిస్ట్రీలో అతడు ఐన్ స్టీన్. ప్రపంచ దేశ నాయకులందరూ కలవాలనుకునే గొప్ప హస్త సాముద్రిక నిపుణుడు' అంటూ కృష్ణం రాజు డైలాగులు చెబుతున్నారు.

  ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’.పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.

  పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్.. గతంలో ‘బిల్లా’, ‘రెబల్’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇపుడు ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ‘రాధే శ్యామ్’ సినిమా విడుదలకు దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్‌ జోరు పెంచింది.

  ఇందులో భాగంగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌‌తో పాటు ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించింది టీమ్. ఈ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వివిధ పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు. స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తో పాటు ప్రాజెక్ట్ కె దర్శకుడు నాగ అశ్విన్ అతిధిగా వచ్చారు. నిర్మాత దిల్ రాజు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, ఆయన పెద్దమ్మ గారు సైతం వేడుకకు విచ్చేశారు. ఇక ఐదు భాషల్లో రాధే శ్యామ్ ట్రైలర్ గ్రాండ్ వేదిక సాక్షిగా విడుదల చేశారు. రష్మీతో పాటు హీరో నవీన్ పోలిశెట్టి యాంకర్స్ గా ఈవెంట్ లో జోష్ నింపారు. ముఖ్యంగా నవీన్ తన ఎనర్జీ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam

  ఉత్తమ కథలు