హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam Overseas collections: ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించిన రెబల్ స్టార్ ప్రభాస్ 'రాధే శ్యామ్'..

Radhe Shyam Overseas collections: ఓవర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించిన రెబల్ స్టార్ ప్రభాస్ 'రాధే శ్యామ్'..

Radhe Shyam Overseas collections: చాలా రోజులుగా ప్రభాస్ (Prabhas) అభిమానులు వేచి చూస్తున్న రాధే శ్యామ్ వచ్చేసింది. చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్‌ను పూర్తి స్థాయి లవర్ బాయ్ పాత్రలో చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. అయితే కొందరికి ఈ చిత్రం బాగా నచ్చేసింది..

ఇంకా చదవండి ...

చాలా రోజులుగా ప్రభాస్ (Prabhas) అభిమానులు వేచి చూస్తున్న రాధే శ్యామ్ (Radhe Shyam) వచ్చేసింది. చాలా ఏళ్ళ తర్వాత ప్రభాస్‌ను పూర్తి స్థాయి లవర్ బాయ్ పాత్రలో చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. అయితే కొందరికి ఈ చిత్రం బాగా నచ్చేసింది.. కానీ మరికొందరు మాత్రం రాధే శ్యామ్ చూసి పెదవి విరుస్తున్నారు. అయితే కలెక్షన్స్ విషయంలో మాత్రం రప్ఫాడిస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) దర్శకుడు. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఓవర్సీస్‌లో (Radhe Shyam Overseas collections) రికార్డు ఓపెనింగ్స్ సాధించింది ఈ సినిమా ప్రీమియర్ తోనే 904 K డాలర్లు వసూలు చేసింది ఈ చిత్రం. హాలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ అద్భుతమైన వసూళ్లు సాధించింది రాధే శ్యామ్. నార్త్ అమెరికాలో మరికొన్ని స్క్రీన్స్ యాడ్ చేశారు. అక్కడ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

తెలుగులో మంచి ప్రేమ కథ చూసి చాలా రోజులైంది. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన ప్యూర్ లవ్ స్టోరీ ఇది. అందులోనూ ఇండియాలో ఇప్పటి వరకు ఇంత భారీ బడ్జెట్ తో వచ్చిన ప్రేమ కథ మరొకటి లేదు. విజువల్ ఫీస్ట్‌గా రాధే శ్యామ్ వచ్చింది. ప్రభాస్ లుక్స్, స్టైలింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. క్లైమాక్స్ అత్యద్భుతంగా వచ్చింది.

Puneeth Rajkumar James: పునీత్ ‘జేమ్స్’ హంగామా షురూ.. వారం రోజుల ముందే టికెట్స్ అన్నీ హాం ఫట్..

విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. జస్టిన్ ప్రభాకరన్ తనపై దర్శక నిర్మాతలు పెట్టిన నమ్మకాన్ని వందకు వంద శాతం ప్రూవ్ చేసుకున్నాడు. అద్భుతమైన పాటలు ఇచ్చాడు. మరోవైపు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్.. ఇలాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా లవ్ స్టోరీని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఒకవైపు ప్రభాస్ ఇమేజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ.. మరోవైపు తాను రాసుకున్న కథకు సరిగ్గా న్యాయం చేశాడు ఈయన. అందమైన కథ.. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే.. వినసొంపైన సంగీతం అన్ని కలిపి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే లవ్ స్టోరీ ఈ రాధే శ్యామ్.

First published:

Tags: Prabhas, Radhe Shyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు