హోమ్ /వార్తలు /సినిమా /

Radhe Shyam : మరికొన్ని గంటల్లో ప్రభాస్, పూజా హెగ్డేల ‘రాధే శ్యామ్’ ట్రైలర్.. అభిమానుల ఎదురుచూపులు..

Radhe Shyam : మరికొన్ని గంటల్లో ప్రభాస్, పూజా హెగ్డేల ‘రాధే శ్యామ్’ ట్రైలర్.. అభిమానుల ఎదురుచూపులు..

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.

Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.

  Prabhas - Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది.  ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానుల రచ్చ మొదలైంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’.పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా  కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్.. గతంలో ‘బిల్లా’, ‘రెబల్’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇపుడు ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ‘రాధే శ్యామ్’ సినిమా విడుదలకు దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్‌ జోరు పెంచింది.

  ఇందులో  భాగంగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌‌తో పాటు ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది టీమ్. ఈ ఈవెంట్‌ను ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్నారు.  ఈ ఈవెంట్‌కు రాజమౌళి హాజరు కానున్నారని అంటున్నారు. ఇక  ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో వరుసగా పాటలను విడుదల చేస్తోంది చిత్రబృందం.

  BalaKrishna : ఫ్యాన్స్‌ను భయపెడుతున్న బాలయ్య నిర్ణయం.. మరోసారి ఫామ్‌లోని దర్శకుడికి ఓకే చెప్పిన నట సింహా ..?

  అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను గత నెల 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ నగుమోము తారలే కూడా చిత్రబృందం విడుదల చేసింది చిత్రబృందం. ఇక మూడో సాంగ్‌ “సంచారి పాటను కూడా రిలీజ్ చేసింది. ఈ పాటను అనిరుధ్ రవిచంద్రన్ పాడారు.

  RRR : రికార్డ్ స్థాయిలో తెలుగులో 1000 పైగా స్క్రీన్స్‌లో ఆర్ఆర్ఆర్ విడుదల.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఎన్ని స్క్రీన్స్ అంటే..


  ఇక ఈ సినిమాకు వివిధ భాషలకు చెందిన ట్రైలర్స్‌ను తన అభిమానులతో చేతుల మీదుగా విడుదల చేయించనున్నారు. ఈ ట్రైలర్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ విడుదలకు రెండు మూడు రోజుల నుంచే సోషల్ మీడియాలో రచ్చ  చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభాస్ అభిమానులు రామోజీ ఫిల్మ్ సిటీకి రానున్నారు.  ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ట్రైలర్ విడుదల తర్వాత ‘రాధే శ్యామ్’ యూనిట్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

  Prabhas Radhe Shyam third song, Soch Liya Song, Nagumomu Thaarale Song released, Radhe Shyam second single, Radhe Shyam first single ee raathale, Radhe Shyam first single release date, Radhe Shyam Teaser, Prabhas and Pooja Hegde Radhe Shyam completes the shooting, Radhe Shyam on Zee5, Radhe Shyam ott release, Radhe Shyam video, Radhe Shyam released date, Radhe Shyam Teaser,Radhe Shyam Release Date, radhe shaym movie music director justin prabhakaran, ప్రభాస్,ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్, జస్టిన్ ప్రభాకరన్
  రాధే శ్యామ్ (Radhe Shyam Photo : Twitter)

  ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల భవిష్యత్తు చెప్పే వాడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పూజ హెగ్డే ప్రేరణ పాత్రలో పూజా కనపడనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Bollywood news, Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood

  ఉత్తమ కథలు