హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Radhe Shyam : కృష్ణాష్టమి కానుకగా రాధే శ్యామ్‌ నుంచి రమణీయమైన పోస్టర్...

Prabhas - Radhe Shyam : కృష్ణాష్టమి కానుకగా రాధే శ్యామ్‌ నుంచి రమణీయమైన పోస్టర్...

Radhe Shyam Photo : Twitter

Radhe Shyam Photo : Twitter

Prabhas-Radhe Shyam : ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కాగా సినిమాకు సంబంధించి కృష్ణాష్టమి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేసింది చిత్రబృందం.

Prabhas-Radhe Shyam : ప్రభాస్  (Prabhas)  హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ (Prabhas Radhe Shyam) సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా సరికొత్త పోస్టర్‌‌ను విడుదల చేసింది. ఈ తాజా పోస్టర్ నెటిజన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ విక్రమాదిత్యగా... పూజా హెగ్డే  (Pooja hegde)ప్రేరణలుగా ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పిరియాడికల్ జానర్‌లో రొమాంటిక్ ఎంటెర్టైనర్ వస్తోంది. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా గోపీకృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణం రాజు, టీ సిరీస్ భూషణ్ కుమార్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సుమారు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ (Justin prabhakaran) సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించారు.

ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో మూడు ప్యాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ’ప్రాజెక్ట్ K’ సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కే  సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే(Deepika Padukone) నటించనున్నారు. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించనున్నారు.  ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ (Adipurush) అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లంకేశుడి పాత్రలో  పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమలో ప్రభాస్‌కు జోడిగా కృతి సనన్ (Kriti Sanon) నటిస్తున్నారు.

ఈ మూడు చిత్రాలతో పాటు కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel )తో మరో సినిమా చేస్తోన్నారు ప్రభాస్. సలార్  (Salaar)పేరుతో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కనున్నట్టు సమాచారం.  ఈ సినిమాలో శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్’గా చేస్తోంది. మరో హీరోయిన్‌గా వాణీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా కన్నడ ఉగ్రమ్‌కు రీమేక్‌గా వస్తుందని సమాచారం.

First published:

Tags: Pooja Hegde, Prabhas, Radhe Shyam, Tollywood news

ఉత్తమ కథలు