• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRABHAS POOJA HEGDE RADHE SHYAM MOVIE TEASER AND RELEASE DATE WILL BE ANNOUNCED ON FEBRUARY 14 SR

Prabhas | Pooja Hegde : ప్రభాస్ పూజాహెగ్డేల ప్రేమకావ్యానికి ముహూర్తం ఫిక్స్.. రాధే శ్యామ్ డేట్‌ను లాక్ చేసిన చిత్రబృందం..

Prabhas | Pooja Hegde : ప్రభాస్ పూజాహెగ్డేల ప్రేమకావ్యానికి ముహూర్తం ఫిక్స్.. రాధే శ్యామ్ డేట్‌ను లాక్ చేసిన చిత్రబృందం..

Prabhas Radhe Shyam Photo : Twitter

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన అందమైన ప్రేమ కావ్యం రాధే శ్యామ్.

  • Share this:
    Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన అందమైన ప్రేమ కావ్యం రాధే శ్యామ్. సాహో సినిమా తర్వాత.. ప్రభాస్ చేస్తోన్న సినిమా ఇది. రాధే శ్యామ్ సినిమాను కూడా  రూ. 140 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌ను రిలీజ్ చేయగా.. ఈ సినిమాలో ప్రభాస్ ‘విక్రమాదిత్య’ గా నటిస్తున్నట్టు పోస్టర్‌లో రివీల్ చేసారు. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్డేట్ టీజర్ ఎప్పుడు విడుదలకానుందో అనే విషయం పై తాజాగా అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ అందమైన ప్రేమ కథా చిత్ర టీజర్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్టుగా తెలిపింది చిత్రబృందం. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవదుల్లేవు. అంతేకాదు టీజర్‌ను విడుదలచేస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ప్రభాస్ సూపర్ కూల్ లుక్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ప్రభాస్ లోని మాస్ నే చూసారు ఇప్పుడు అతనిలో ప్రేమను చూడండి అంటూ ఒక ప్రీ టీజర్ తో టీజ్ చేశారు. దీంతో విడుదలకానున్న టీజర్ ఇంకేంత మనోహరంగా ఉండనుందో అని ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.



    ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం అందించాడు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుంది. మరో కీలకపాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సలార పేరుతో వస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్’గా చేస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: